విశ్వాసానికి మొదటి దర్శణం
నిజ జీవితం ఒక నాటకరంగమే
అయినా…కపట నాటకం కారాదు…
బతుకే ఓర్పు… విన్యాసం కానేరదు
పదితలల నేర్పులతో హృదయము పగిలిన
వింత అవకాశాల కొరకు వేదనల ఆవేషాన్ని
పురుడోసుకొని…వ్యక్తిత్వం లేని తెరపై
బొమ్మగా కాకతాళీయంతో విలువల స్థానమెంతటిదోనని కొలువద్దు…
ప్రతినిత్యం నూతన వసంతమే అనుసరించే వాడికి…విధి వైపరిత్యాలు కపట నాటకాలు
కావు…ఆ మానసిక ఒప్పందంతో కాలంతో
నడిచే చేతనను గమనించు…ప్రయత్నం
పలకరించినదిగా మానవత్వపు వికాసాన్ని
వికసింప చేస్తు…అందరి ఆదర్శాల నమ్మకాన్ని
కోటి వెలుగుల ప్రభాతంగా నడిపించు…
మనస్సున స్వార్థం పేరుకు పోయిన…
నిలువుటద్దాన నిగర్వితనం సాహసమై
చూపే యదార్థ భావాలు కపటాలు కావు
ఊహించే లోకం ఉనికి తప్పినా…
మరణమన్నది మరువని వాస్తవం
దిగులును విడిచి స్వతంత్ర్యమై సంకీర్త
నాదంతో పూరించే ప్రతిక్షణం నీకోసమే
ఎదురు చూస్తున్నది…
బతుకున సందేశాన్ని వీధి భాగోతంగా
వినకు…కునుకు దీయని కాలానికి
కరువు కాటకాలు కనిపించని దూరాలని…
ఆరాధించే దైవం తపన చేసినదై నడిచిన
సత్యంగా కలగన్న మనస్సున మధురంగా
నింపుతు…తన్మయత్వపు ప్రయానంలో
నీతో సహనమై నడిచే నీడలు కపట
నాటకాలు కావు…శ్రద్దా భక్తులకు
మొదటి దర్శణమై…అది ముక్తికే మార్గం
అన్వేషించు…
-దేరంగుల భైరవ