విశ్రాంతి ఎప్పుడంటే…
1) కన్న సంతు కొరకు కష్టించు తల్లికి
నిమిషమైన కాలు నిలువదెచట
భర్త సహకరించి పనికి తోడుగనుంటె
భార్య హాయిగుండు భర్త వలన
2) ఎడ్డెమంటె తెడ్డె మేజంట యుండునో
కొట్టుకొనుటకేమి కొదువరాదు
సర్దుబాటు లేని సంసార నౌకను
ముందుకెట్లు నడుపు మునుగకుండ
3) విభుడు సహకరిస్తె విశ్రాంతి దొరుకును
లేనిచో దొరకున లేశమైన
లేమ చేసుకున్న లేశ పుణ్యంబుకు
అంతులేని సుఖము ననుభవించు
– కోట