విరులు

విరులు

అచ్చమైన అందంకోసం
ఆనందం కోసం కావాలి
విరుల సిరులు .
విరుల సిరులు మనకు
అవినాభావ సంబంధం
అదెలా అంటే

మనలోగిల్లలో విరబూసిన
విరితోట లేకపోయినా
గులాబి మొక్కైనా అందమే
మరి మనసుకు

భగవంతుని ఆరాధనలో
భక్తి కాకుండా విరుల
మాలలతో అలంకరించి
ఆనందిస్తాం. ఆరాధనలో
ఒక్క పూవు చేరినా
మది పరవశించి పోతుంది

మగువల మనస్సు దోచిన
విరజాజుల పరిమళాల
అద్భుతం .

విరితోటలోని తుమ్మెదల
మకరందాల మాధుర్యం
ఆబిందువులు
అమృత తుల్యమైన ది

నవ వసంత కాలంలో
పక్షుల పలకరింపు లతో
విరి తోటలు వింద్యామరలుగా
మారుతాయి.

కలువలు కమనీయమై
నయనానందకరంగా
పులకిస్తాయి .

పూభోని సిగలో సుగందాల
విరుల మాల నెచ్చెలి
అందాలకు కానుక

సంతసించిన మనసుకు
సవ్వడిలేని సంగీతం
విరుల వనం వికసిస్తే

సంతోషాల సందేశాల కు
సమాధానాలు చెప్పే
హృదయ గీతికలు
విచ్చుకున్న గుత్తులు

శుభా శుభాలను కు
స్వాగత తోరణాలు
సందడి చేసే విరుల మువ్వలు

అనురాగాల ఆత్మీయతల
అన్నివర్ణాల విరుల మాలికలు మంత్రముగ్ధుల్ని
చేసి మురిపిస్తాయి మరి

మనసు ఉల్లాసంగా వుండేందుకు సరిపడా
సౌందర్య విరులను
సృష్టించిన ప్రకృతికి
ఏమిచ్చి తీర్చగలం
మన శక్తితో ఆలోచించాలి
అందరం ………..?

– జి జయ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *