విప్లవం
కన్నవారిని పుట్టిన ఊర్ని,తమనే నమ్ముకుని కట్టుకున్న వార్ని ,కన్న పిల్లల్ని వదిలి ప్రజా సేవ కోసం బయల్దేరి అడవుల పొంటి అష్ట కష్టాలు పడుకుంటూ, తిండి లేక ,కూడు లేక గుడ్డలు సరిగా లేక, అలమటిస్తూ వన్య మృగాలకు బలి అవుతూ, తక్కినవారు అలుపెరుగని బాటసారులై, తామున్న చోటు తమకే తెలియకుండా ఈ క్షణం ఊపిరితో ఉన్నాం ,మరుక్షణం లో ఉంటామో, లేదో తెలియని స్థితిలో, కూడా వారి ప్రాణాలను ఫణంగా పెట్టి, ఆత్మస్థైర్యంతో ముందుకు నడుస్తూ ,ఆట పాట నృత్య ప్రదర్శన ద్వారా ప్రజలలో చైతన్యం తెప్పిస్తూ,
తుపాకి తూటాలకు బలి అవుతూ ,తమ తుది శ్వాస వరకు పోరాడుతూ ,దేశసేవ కోసం ప్రాణాలను అర్పిస్తారు
అలాంటి విప్లవ కారుల త్యాగాల ఫలితమే ఈ దేశం
జయహో అమరవీరులకు శతకోటి పాదాభివందనం👏
👏👏👏👏🌼🌼🌼🌼
-భేతి మాధవి లత