విప్లవం
ఈ పదం విని ఎదో అనుకోకు మిత్రమా,
విప్లవం అంటే మార్పు కోరడం,
విప్లవం అంటే నీకై చేసే పోరాటం,
తప్పుని తప్పు అని చెప్పడం విప్లవం,
నీ మనుగడకై నువ్వు ఎంచుకున్న దారే విప్లవం,
కాలంతో మారడం విప్లవం,
నలుగురిని మార్చేది విప్లవం,
చెడును ఎదిరించేది,
మంచిని నేర్పేది విప్లవం.
సమాజం పట్ల ఉండే నైతిక భాధ్యత విప్లవం.
– చైతన్య కుమార్