వింత ప్రపంచం
అంతర్జాలం – ఇది ఒక వింత మాయ జలం,
చేస్తుంది పని సులభం,
మనకి పని లేకుండా చేయడం దానికి చాలా సులభం,
తెలియని వారితో తగువులు తెస్తుంది,
తెలిసిన వారిని దాని మాయతో దూరం చేస్తుంది.
ప్రపంచాన్ని అరచేతిలో చూపిస్తుంది,
అదే ప్రపంచం అనుకునేలా కూడా చేస్తుంది.
మాట్లాడే అవకాశం ఇస్తూనే,
మౌనాన్ని పరిచయం చేస్తుంది.
కలికాలనికి తగిన ఉదాహరణ ఈ అంతర్జాలం,
అదే అండి “మనలోనే మంచి చెడు”.
దీన్ని తిట్టాలా లేక పోగడలా అని అర్ధం అయ్యే రోజు వస్తే బాగుంటుంది.
ఏదైనా కొంతవరకే బాగుంటుంది,
ఇది అలాగే అనుకుంటే మన బతుకు బాగుంటుంది.
-చైతన్య కుమార్ ఈగ