వింత మనుషులు

వింతమనుషులు

 

మనచుట్టూ చాలా మంది ఉంటారు . ఇంటి పక్కవారు , ఎదురింటి వారు, ఆ పక్కింటి వారు ఇలా కాకుండా రోడ్డు పై వెళ్తుంటే చాలా మంది కనిపిస్తారు. అలాగే ఆఫీస్ లోనూ ఉంటారు.

వీరందరి మనస్తత్వాలు వేరు వేరు గా ఉంటాయి. పక్కింట్లో ఉండే వారు కొందరు. గలగల మాట్లాడుతూ వరుసలు కలిపెస్తూ ఉంటారు.మరికొందరు అసలు నోరు విప్పకుండా జెస్ట్ చూస్తూ వెళ్లిపోతారు మాట్లాడకుండా, అప్పుడు అనిపిస్తుంది మాట్లాడితే నోరు అరిగుపోతుందా అని, ఇంకొందరు ఉంటారు. వారికి బిల్డప్ ఎక్కువ .కాస్త డబ్బుంటే చాలు మనల్ని దెకరు పొగరుగా ఉంటుంటారు. ఎవరి తోనూ కలవరు.

ఇక ఇంటి ఓనర్స్ కూడా అలాగే ఉంటారు కొందరు మాట్లాడితే కొందరు రెంట్ వస్తె చాలు అన్నట్టు మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు.

ఇక రోడ్డు పై వెళ్లేటప్పుడు మనుషులు కొందరు వింతగా మనల్నే చూస్తూ ఉంటారు. మరి వారే గ్రహం నుండి వచ్చారో , కిందకి పైకి చూస్తుంటారు. ఇంకొందరు చూసి,చూడనట్లు చూస్తారు.

మరి కొందరు బస్ ఎక్కున వెంటనే ఎవరితో అయినా సరే మాటలు కలిపి మాట్లాడుతూ ఉంటారు.వాళ్లకు మాట్లాడక పోతే తోచదు.బస్ అంతా వారి మాటలే వినిపిస్తాయి. ఇంకొందరు ఫోన్ లో తల పెట్టీ వారి స్టేజ్ వచ్చేదాకా తల ఎత్తరు. ఇంకొందరు తమలో తామే నవ్వుకుంటూ ఉంటారు, ఇంకొందరు చెవుల్లో ఎఆర్ ఫోన్స్ పెట్టుకుని హ, అవును , అదే , అని మనతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది, మనల్నే నెమో అని అనుకుంటాం కాని చివరికి తెలుస్తుంది వాళ్ళు ఫోన్ లో మాట్లాడుతున్నారు అని, అప్పుడు మనకు వచ్చే నవ్వు అపుకోలెం, ఇంకొందరు మెలికలు తిరుగుతూ సిగ్గు పడుతూ మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారిని చూస్తే మనకే నవ్వు వస్తుంది కానీ గట్టిగా నవ్వలేము.  

ఇంకొందరు ఫోన్ లో గట్టిగట్టిగా మాట్లాడుతూ అరుస్తూ ఉంటారు. ఎంతలా అంటే అప్పుడే వారి ఎదురుగా ఉంటే కొట్టేంత గా అరుస్తూ ఉంటారు. ఇక బస్ లో గుసగుసలతో ఫోన్ లో మాట్లాడేవారు కొందరు. గట్టిగా మాట్లాడుతూ పక్క వారికి తమ ఇంటి విషయాలు అన్ని తెలిసేలా మాట్లాడతారు. ఇంకొందరు ఫోన్ లోనే సంసారాలు చేస్తూ ఉంటారు,అవన్నీ చూస్తూ ఛి అనిపించక మానదు. ఇంకొందరు ఎక్కడ దిగాలో తెలియక ఫోన్ లో అడ్రెస్ అడుగుతూ ఉంటారు గట్టి గట్టిగా మాట్లాడుతూ ఇవన్ని చూస్తూ మనం సైలెంట్ గా ఉంటాం, మనకే ఒక్కోసారి అడ్రెస్ చెప్పాలి అనిపిస్తుంది. 

ఇక ఆఫీసులో కొందరు గట్టిగా మాట్లాడితే కొందరు మెల్లిగా మాట్లాడతారు.బాస్ ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా మాట్లాడుతూ ఉంటారు. ఇంకొందరు లేనిపోని గొప్పలు చెప్పుకుంటారు. అలా చెప్పక పోతే వారికి రోజు గడవదు. ఒకరి పై మరొకరికి చాడీలు చెప్పేవారు ఉంటారు. అలా చెప్పకపోతే వారికి కడుపు నిండదు.

ఇలా ఎన్నో రకాలుగా మనుషులు ఉంటారు.కొందరు విషాదం అంతా మొహం లో కనిపిస్తుంది. తామంత విషాదం ఎవరికీ లేదన్నట్టు ఉంటారు. మరి కొందరు సంతోషం తామే అన్నట్టు గా ఉంటారు. తమ సంతొషం అందరికీ తెలిసేలా మొహం లో మెరిపిస్తు ఉంటారు. ఇంకొందరు తమ గురించి ,తమ తాత, ముత్తాతల గురించి ,ముచ్చట్లు చెప్తూ ఉంటారు.

ఇలాంటి వింత మనుషులలో మీరెలాoటి వ్యక్తి చెప్పండి. నేను అయితే ఇదిగో బస్ ఎక్కిన దగ్గరి నుండి అందర్నీ గమనిస్తూ ఉంటాను. ఎందుకంటే ఏ మనిషి దగ్గర ఏ కథ దొరుకుతుందా , ఎవరు ఎలాంటి సమస్యలతో బాధ పడుతున్నారా అని అన్ని గమనిస్తూ ఉండే రకాన్ని.

మీరే రకమో చెప్పండి..

– భవ్యచారు

0 Replies to “వింత మనుషులు”

  1. నేను కూడా ఎవరితో సరిగ్గా మాట్లాడను..
    నేను మాట్లాడడం చాలా తక్కువ. అందరి గురించి చాలా చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *