వింత మనుషులు
మనముండే మన సమాజంలో వింత మనుషులు ఎక్కవై పోయారు..
ఒకప్పుడు వింత మనుషులంటె ఏదో గ్రహం నుండి వచ్చేవారు..
వారిని వింత మనుషులని వింతగా చూసేవాళ్లం..
సాసర్లలో దిగే వాళ్లు వాళ్లని ఏలియన్స్ అంటాం!
కానీ ఇప్పుడు మన పక్కనే ఉంటూ మన సొమ్మే తింటూ మనతో మంచిగానె ఉన్నట్టు ఉంటూ మన మీదనే పగ పడుతున్నారు..
మనముందు ఒకలా మన చాటుకు ఒకలా ప్రవర్తిస్తున్నారు..
వాళ్లను వింత మనుషులనాలో? ఇంకేమనాలో? అర్థం కావడం లేదు..
అలాంటి వాళ్లు వింత మనషులా?
విచిత్రమైన మనుషులా? ఏమనాలి వాళ్లని?
మీకేమైనా అనిపిస్తే చెప్పండి..
-ఉమాదేవి ఎర్రం