వింత

వింత

 

నే పలికే
స్వరాలన్నీ
అజ్ఞానపు
గీతికలే
అయితేనేం?

గొంతు పెంచి
జంతు గణపు
వింత వింత
రోతలన్ని
జనుల చెవికి చేరుస్తా…..

జఢము నిండి
మడము తిప్పి
ఒడలు జార్చి
బడలిక నొందిన
బడుగుల గొంతై
బడబాగ్నిని రగిలిస్తా….
కడదాకా వెంట నిలిచి
చెడు దారిని గర్హిస్తా…
దుర్జనులను భర్జిస్తా…
అర్జునుడై గర్జిస్తా…

 

-స్వామి

0 Replies to “వింత”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *