వినాయక చవితి శుభాకాంక్షలు
నలుగు పిండి శరీరమంట
అమ్మవారి మనమందు పుట్టెనంట
ద్వారమందు నిలిపెనంట
ప్రాణ ప్రతిష్ట చేసెనంట
అయ్యగారితో ఆబాలుడు
తగాదా పడెనంట
అయ్యగారు తలనరక
అశువులుబాసెనంట
అమ్మవారు దుఃఖముతో అయ్యగారిపై
కోపించెనంట
అయ్యగారు గజాసురుని శిరం పెట్టెనంట
తిరిగి ప్రాణం పోసె నంట
మూషికాసురునిపై ప్రయాణమంట
విఘ్నేశ్వరునిగా వెలుగు చుండె నంట
ఈరోజు భాద్రపద శుద్ధ చవితి నాడు
శుద్ధ పరచ వచ్చెనంట
మనల భద్రముగ చూడ
వెంచేసెనంట మనయింటికి
జై!బోలో గణేష్ మహరాజ్ కీ జై!
– రమణ బొమ్మకంటి