విలువ లేని గొడుగున
వలస జీవితమా…వడి తెలియక
వదిలిపోతున్న సంతకం లేని ప్రయాణమా
నిదురించిన గుండెలో చెదిరిన స్వప్నానికి
తలవంచిన దళిత భాంధవ్యమా….
కరువు కాటకాలతో మునిగిన సంక్షోభమా
ఒక్కసారి ఆలోచన చేయలేవా….
చెప్పలేని సందేశాలతో విషతుల్యమై…
కొలిచిన కారణ్యంతో బదులు చెప్పని
నియమానికి నడిచే దారి తెలియక…
సుఖ దుఃఖాల సారాంశం తెలిసిన వాడివై
పరిచయం కాని పసికారును లోకం స్వార్థానికి
గురిచేస్తు…నడిపిస్తున్న ఆ పయనం
ఎంత వరకు…తెలుపగలవా…
నిను నమ్మి వచ్చిన మూడుముళ్లు
బంధానికి నీ నమ్మకం ముగుదాడై
బిగిస్తు….నడిపించిన దారి ప్రలోభాలకు
నుదిటి తిలకం చెమట దారులతో చెదిరి
పోతున్నది…అలుపు దీరే ధర్మసత్రాలే లేని
నరకంఠకుల పాలనలో ఆకలికి చావులేదని…
ధర్మపత్నిగా చెప్పలేక పోతున్నది…
దూరపు కొండలు నునుపు ధనమని…
తలచినా ప్రేరేపణలతో….ప్రాపంచీకరణాల
నవయుగానికి వారసుడవై నిలిచినా
విలువలేని గొడుగున తల దాగదు…
కదిలే రూపాన్ని దేహంగా దిగమింగుతు
మధుర జ్ఞాపకాల మననం విడ్డురాలై
కలగన్న దేహాన్ని బలివాడన పశువులుగా
నడిపిస్తున్నావు న్యాయమేనా…ఎడబాటు
చేయకు గ్రహపాటును తొలగించుకో….
–దేరంగుల భైరవ