విజయానికి రథసారథులము
నియమం లేని అనుకూలత దొంగాటగా
సమయం చేసిన సృజనకు దొరకదు…
బతుకులను కొయ్యలు బార్చే నేరగాళ్ళు
పగటికి వేషమైనా…భృక్కుటి శ్వాసల
దర్శణానికి ఏకం చేయకు…
క్షణానికి నోచుకోని వ్యర్థమై శూన్యం పోసిన ఒలకరింపులతో జాడల ముద్రలు
మాయాలోకపు తెరలపై మానవత్వాన్ని
గారఢీగా ఆడుతున్నారు…
వీరుల సన్నిధిలో విరబూసిన భావాలతో
తిరగబడ్డ చరిత్రలకు ఆధారమవుతు…
పెనవేసిన మాటల తార్చుడులను అణిచివేసే
ఆయుధమై…నిజం గెలిచేది అందరి కోసమని
అలముకొన్న చీకటి సంకెళ్ళను తెంచుతు
ఒక హృదయం బిగించిన శ్వాసలు ఎందరికో
వెలుగవ్వాలని…పిడికిలి నినాదమై నిజాల
ఉప్పెనలతో సంద్రమై నిండుతున్నాము…
పగలనకా రేయనకా పిలిచిన వసంతాలు
గీసిన మర్మాలు జ్ఞాపకాల గుర్తులుగా…
మానసిక ఏకాంతాన్ని నూతన పరిచయాలతో
ఆహ్వానిస్తు… జ్ఞాన ప్రవాహమై నిత్య
సందేశాలను కలుపుకొంటు… తన్మయత్వం
పొగడ్త కాదని పేదవాని భుజాన్ని గుండెకు
హత్తుకొని…కనువిప్పు కాని ప్రపంచానికి
మేమన్నది దేహమైనా…మానవత్వానికి
ప్రతి రూపాలమని తెలుసుకొండి….
పురోగతి కనబరిచిన సత్య సీమలో
హక్కులను నెరవేర్చుకొనే ప్రగతి పథాలను
మారని శాసనాలతో నడిపిస్తు…
అలౌకిక వాదుల గుండెల్లో మేము సైతం
మనుషులుగా చైతన్యమవుతు ఉద్యమించే
ప్రభాత భేరికి అడుగవుతు…చెల్లవు చెల్లవు
మీ వాగ్ధానాలు ఒట్టి కల్లలేనని…
ఎల్లలుగా నిలిచిన మా నిర్ణయాలకు మేమే
వారసులమని మీ వంచనలకు లొంగని
విజయానికి రథసాథులము…
-దేరంగుల భైరవ