విజయము
ఆ.వె
1) అంతులేని సంద్రమంతు చూడగ నెంచి
ముందుకొచ్చెనరుడు ముప్పు వున్న
సాహసించినాడు సంద్రాన్నిగెలువగా
సాటి మిత్రులింత సాయపడగ
ఆ.వె.
2) ఓడ చిన్నదైన. ఒడ్డుకు చేరచ్చు
ఐకమత్యమున్న అందు జయము
ఊతమున్న మేలు. ఓటమి కలుగదు
జట్టుగ పయనించు జయము మీదె
ఆ.వె.
3) లంగరెత్తి నావ నడిపించు సంద్రాన
చతికిల బడకుండ సాహసించు
ధైర్యలక్ష్మివున్న దరిజేరు విజయము
కడలి అంచుదాక కదలి పొమ్ము
ఆ.వె
4) తెగువ జూపినావు తెడ్డూత కర్రగా
కడలి అంతుజూడ కదలినావు
భయము లేక చిన్న పడవపై మానవా
సాహసించి చూడు జయము నీకు
ఆ.వె.
5) నీళ్ళ అంతుజూడ నీవల్ల నేమగు?
కడలి మధ్య నాటు పడవ యందు
నీవు పిచ్చుకంత నీరు ఉధృతగంగ
అణగి మణగి యుండు అహము విడిచి
ఆ.వె.
6) కడలి తలచుకుంటె కడతేర్చితీరును
కరుణజూప వేడు. కడకు చేర్చు
ఎదురు తిరిగినావొ ఎక్కడో ముంచును
గంగ పాలవుదువు గర్వ ముంటె
– కోట