విద్య

విద్య

విద్యకి కొత్త పెళ్లి అయ్యి ఒక సంవత్సరం అవుతుంది. ఆమె సోషల్ మీడియాలో హుషారు ఉంటూ వీడియోలు చేస్తుంది. లైక్ కొట్టడం వాళ్ళందరికీ ఫాలో అయ్యేది. అయితే ఒక అబ్బాయి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. కానీ విద్య మాత్రం అసలు రిప్లై ఇవ్వలేదు.

అలా కొన్ని రోజులు తర్వాత ఇంస్టాగ్రామ్ లో ఉన్న తన ఫోటోలను మార్ఫింగ్ చేసి పెట్టేవాడు. అది చూసి తన భర్తకి చెప్తే తన భర్త అపార్థం చేసుకొని బాగా కొట్టాడు కూడా. ఇంకా తట్టుకోలేక అతని మీద పోలీస్ కంప్లైంట్ చేసింది విద్య. తన ఫోటోలను మార్ఫింగ్ చేసిన వాడిని పట్టించుకోకుండా తననే అందరూ నిందిస్తున్నారు. తన వాళ్ళే తనని నిందిస్తుంటే తట్టుకోలేకపోతోంది విద్య.

ఏంటో ఈ ప్రజలు అసలు అర్థమే కాదు. మంచిగా ఉంటే పొగుడుతారు. చెడ్డగాలంటే చాలు ఓ కాకులాగా స్వార్థపూరిత ప్రజలు మారిపోతారు. విద్య విషయంలో కూడా అలాగే జరిగింది. ఇంకా విద్య ఒక నిర్ణయం తీసుకుంది. తన ఫోటోలు మార్ఫింగ్ చేసింది ఎవరు తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇలా విద్య లాగా ఎంతో మంది బలి అయిపోయారు.

వాళ్ళు ఏమి చేయలేక ఆ సమస్య నుండి బయట పడలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు. కట్టుకున్న భర్త కూడా నమ్మలేదు తల్లితండ్రులు నువ్వే తప్పు చేసావ్ అని అంటున్నారు. అత్త మామ ఇంటి నుండి గెంటేశారు. విద్యని గతంలో ఒక అబ్బాయి ప్రేమించాడు. అబ్బాయి ఇలా చేశాడేమో అని ఆలోచిస్తుంది. అబ్బాయిని రెండు రోజులు గమనించింది.

అతని ఫోన్ కూడా సంపాదించి చెక్ చేసింది కూడా. అతనే అని తెలుసుకొని రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు అప్పజెప్పింది విద్య. ఏ తప్పు చేయలేదని అందరూ తెలుసుకున్నారు. విద్య మాత్రం ఓకే నిర్ణయం మీద ఉంది. తనది తప్పు లేదని ఎంత చెప్పినా వినకుండా తన నిందిస్తూ కాకులాగా పీడిస్తూ ఉన్నా ప్రజలను కోపంగా చూసింది.

అందరికీ దూరంగా వెళ్లిపోయింది విద్య. తన గమ్యం వైపు అడుగులు వేసుకుంటూ అందరికీ దూరంగా ఒంటరిగా బతుకుతూ ఒక పెద్ద స్థాయికి ఎదిగింది. తన లాంటి అమ్మాయిలకు ఎందరికో ఆదర్శంగా నిలిచింది. విద్య ప్రయాణంలో ఒంటరిగా అందరిని ఎదుర్కొంటూ ఇంత స్థాయికి ఎదిగింది.

అందరూ విద్య లాగా ఆలోచించి దేనికి లోబడకుండ సమస్యని పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాను. టెక్నాలజీ మారినా మోసాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. వాటి తెలుసుకొని అక్రమాతంగా ఉండాలని కోరుకుంటున్నాను.

– మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *