విధి
2015
అమ్మ: సాయి లెగు స్కూల్ కి టైం అవుతుంది
సాయి: అప్పుడేనా అమ్మా…!
అమ్మ: త్వరగా రెడీ అవ్వు ట్యూషన్ కి కూడా వెళ్ళాలి.
సాయి: ట్యూషన్ ఆ? ఇదేప్పటి నుండి? ఎప్పుడు మాట్లాడావు?
అమ్మ: నిన్న సాయంత్రం
సాయి: ఉఫ్ఫ్ నా పని అయిపొయింది….
అమ్మ: 10th క్లాసు బాబూ అలాగే ఉంటుంది.
స్కూల్ లో….
అఖిల్: రేయ్ సాయి ఈరోజు నుండి ట్యూషన్ వెళ్తున్నావ్ అంట కదా
సాయి: నువ్వు లేకుండా ఎలా వెళ్తా రా…
అఖిల్: నేనా నేను వెళ్ళట్లేదు రా
సాయి: రేయ్ రేయ్ నిన్న మన మదర్స్ ఇద్దరూ వెళ్లి మాట్లాడారు అంట రా
అఖిల్: ఇన్ని సంవత్సరాలు లేని కష్టాలు ఏంటి రా బాబు ఈ 10th క్లాస్ ఏమో కానీ….
సాయి: అలానే ఉంటుంది రా పద స్కూల్ వచ్చింది…
అఖిల్: రేయ్ అయేషా రా
సాయి: పోనీ లే రా
అయేషా: హాయ్ సాయి గారు…
సాయి: హాయ్ ఒకే కానీ గారు ఏంటి ఎందుకు అలా మాట్లాడుతున్నావు?
అయేషా: ఏమో మీకు మర్యాద ఇవ్వాలని అనిపించింది.
సాయి: అబ్బా
అయేషా: నేను ఈరోజు నుండి ట్యూషన్ కి వెళ్తున్నా…
సాయి: అవునా ఎక్కడా?
అయేషా: మీ ఇంటి వెనకాల
సాయి: అవునా నేను కుడా ఈరోజు నుండి అక్కడికే వెళ్తున్నా…
అయేషా: అవునా
సాయి: హా అఖిల్ కూడా వస్తున్నాడు.
అయేషా: శ్రీ కూడా వస్తుంది అఖిల్
అఖిల్: శ్రీ ఆ….
అయేషా: అయ్యో సిగ్గు…
సాయి: నువ్వు సిగ్గు పడడం ఆపరా బాబు నాకు నవ్వు ఆగట్లేదు
అఖిల్: ఛీ పోరా నీకు అలాగే ఉంటది…
అదే రోజు సాయంత్రం అయిదు గంటలకు.
అయేషా: సాయి సాయి…
సాయి: హా వస్తున్నాను ఒక్క నిమిషం….
అయేషా: అవును ట్యూషన్ కి టైం అవుతుంది త్వరగా రా
సాయి: వస్తున్నా
అఖిల్: శ్రీ ఎక్కడ?
అయేషా: నాకేం తెల్సు?
అఖిల్: నువ్వే చెప్పావు కదా తను కూడా వస్తుంది అని
అయేషా: ఏమో నాకు కూడా అలాగే చెప్పింది
అఖిల్: ప్లీజ్ చెప్పొచ్చు గా
అయేషా: ట్యూషన్ లో ఉంది లే…
అఖిల్: నేను వెళ్తున్నా మీరు త్వరగా వచ్చెయ్యండి…
అయేషా: హే నేను కూడా వస్తున్నా ఆగు…
సాయి: రేయ్ ఒక్క నిమిషం ఆగండి రా మీరు..
ఇలా ప్రతీ రోజు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ 10th క్లాస్ ను బాగా ఎంజాయ్ చేస్తూ గడిపేవారు. వీళ్ళు చిన్నప్పటినుండి బెస్ట్ ఫ్రెండ్స్. అలా 8 మంత్స్ గడిచిపోయాయి.
టీచర్: డియర్ స్టూడెంట్స్ మీకు రేపటినుండి ప్రీ ఫైనల్స్…
అఖిల్: అప్పుడే ఇన్ని రోజులు గడిచిపోయాయా….?
సాయి: అవును రా కాని నువ్వు మాత్రం ఏమి చెయ్యలేదు
అనగానే అయేషా అండ్ సాయి ఇద్దరూ నవ్వారు
అఖిల్: నవ్వకండి రా ఇంకా రెండు నెలలు అంతే ఆ తర్వాత ఎవరం ఎక్కడ ఉంటామో…
సాయి: అవును రా నిజమే….
అఖిల్: మన దగ్గర ఫోన్ లు కూడా లేవు రా…
సాయి: సరేలే రా బాబు పద టైం అవుతుంది ట్యూషన్ కి కూడా వెళ్ళాలి….
శ్రీ: హాయ్ అఖిల్
అఖిల్: హాయ్
శ్రీ: ఎక్కడికి వెళ్తున్నారు?
అఖిల్: ఇంటికి వెళ్తున్నాం…
శ్రీ: అవునా బెకరీకి వెళ్దామా?
అఖిల్: హా వెళ్దాం పద…
సాయి: సరే బాయ్ రా అయితే….
శ్రీ: హే మీరు కూడా రండి…
సాయి: హా వస్తున్నాం…
శ్రీ: ఏంటి అందరూ డల్ గా ఉన్నారు?
సాయి: ఏమి లేదు ఇంకా 2 మంత్స్ ఏ కలిసి ఉంటాము తర్వాత ఎవరం ఎక్కడ ఉంటామో తెలిదు అదే కొంచం…
అఖిల్: రేయ్ అదే ఆలోచిస్తున్నావా?
అయేషా: అవును అదే
శ్రీ: ఎహ్ ఆపండి మీ బాధ. ఎం తిందాం అది చెప్పండి….
సాయి: ఎదో ఒకటి
అయేషా: ఎదో ఒకటి
శ్రీ: ఎదో ఒకటి
అఖిల్: అన్నా నాలుగు ఎదో ఒకటి ఇవ్వు
బెకరి ఓనర్: ఏంటి తమ్ముడు?
అఖిల్: వీళ్ళు కూడా అదే చెప్పారు అన్న…
సాయి: రేయ్ ఆపరా… అన్నా నాలుగు ఎగ్ పఫ్స్ ఇవ్వండి అన్నా…
అప్పుడే ఒక తాత వాళ్ళని పలకరించాడు.
తాత: బాబూ మీరు మాట్లాడేది మొత్తం నేను విన్నాను.. మేము కూడా మీలాగే బాధ పడేవాళ్ళం ఉన్న ఫ్రెండ్స్ ని వదిలి వెళ్ళిపోవడం ఎలా అని చాలా రోజులు బాధ పడ్డాం. ఆ తర్వాత ఒకరు సినిమాల్లోకి వెళ్ళిపోయారు, ఒకరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, ఒకరో బిజినెస్ పెట్టుకున్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. ఇప్పుడు మేమందరం ముప్ప్లై సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఎవరు వస్తారో ఎవరు రారో తెలిదు…
సాయి: తాతా కానీ నువ్వు మాత్రం నీ ఫస్ట్ లవ్ కోసం వచ్చావు కదా….
తాత: అవును బాబు కానీ తనకి పెళ్లి అయిపొయింది లే…
సాయి: అవునా
అఖిల్: రేయ్ పదండి రా ట్యూషన్ కి టైం అవుతుంది…
సాయి: సరే తాత బాయ్ మళ్ళి అమ్మ తిడుతుంది.
శ్రీ: ట్యూషన్ తర్వాత వస్తాము తాత అంతలోపు మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యండి…
తాత: ఆ సరే అమ్మా జాగ్రత్త
ట్యూషన్ తర్వాత…
సాయి: హాయ్ తాత
తాత: హాయ్ బాబు…
సాయి: ఎలా అయింది తాత మీ రీ యూనియన్
తాత: ఏదో అలా ఉంది
అయేషా: తను రాలేదా?
తాత: వచ్చింది
శ్రీ: మరి ఎందుకు డల్ గా ఉన్నావు తాత
తాత: తనకి ఒక అబ్బాయి ఉన్నాడు.
శ్రీ: ఏంటి?
అఖిల్: అవునా? అయ్యో….
సాయి: రేయ్ ఎందుకు రా అంత ఫీల్ అవుతున్నావు ఆల్రెడీ పెళ్లి అయ్యింది అని చెప్పాడు కదా…
అఖిల్: రేయ్ పాపం రా తాత ఎంత బాధ పడి ఉంటాడు…
తాత: చూడు బాబు లైఫ్ అంటే ఇంతే మనం అనుకున్నది మనకు దొరకవచ్చు దొరకకపోవచ్చు కానీ మన కోసం ఏవో ఒకరు ఎక్కడో అక్కడ ఉండే ఉంటారు. మనం అనుకున్న వాటిలో కొన్ని అవుతాయి కొన్ని అవ్వవు… కానీ మనం మాత్రం అలాగే ఉండాలి. తనని చూడాలి అని అనుకున్నప్పుడు వచ్చిన ఎక్సైట్ ,మెంట్ తనని చూసాక రాలేదు.
సాయి: అది సరే కానీ తాత… నిన్ను ఎక్కడో చూసినట్టు ఉంది…
తాత: నన్ను ఇంకా గుర్తుపట్టలేదా?
అఖిల్: మర్చిపోయాం తాత కానీ ఎక్కడో చూసాం
అయేషా: అవును నేను కూడా చూసాను.
శ్రీ: హా సండే మ్యాగజైన్ లో చూసాము.
తాత: ఆ లైట్ బల్బ్ అలాగే ఈ షాప్ ఓనర్ ని నేను…
సాయి: హా అవును కదా…
అఖిల్: మర్చిపోయాను…
అయేషా: మీరే కదా ఆ బల్బ్ కంపెని సీఈఓ
తాత: హా అవును అమ్మ… తన హస్బెండ్ నా కంపెనీలో ఒక ఎంప్లాయ్
సాయి: ఏంటి మీ ఫస్ట్ లవ్ హస్బెండ్ మీ కంపెనీలో ఒక వర్కర్ ఆ
తాత: చెప్పను కదా బాబు… ఒకటి పోతే ఇంకొకటి వస్తుంది అని…
– విగ్నేష్ సాయి