వెన్నుపోటు

 వెన్నుపోటు

 అడవికి రాజు అయిన సింహం దగ్గరికి ఒక నక్క వచ్చింది.
“మహారాజా… నేను ఇప్పుడు మీ అడవికి కొత్తగా వచ్చాను. మీకు ఏమైనా కావాలి అంటే నన్ను అడగండి , తప్పకుండా చేసి పెడతాను” అని చెప్పింది నక్క.

“అలాగే నక్క తప్పకుండా చెప్తాను” అని చెప్పింది సింహం.ప్రతిరోజు ఆహారం కోసం వేటకి వెళుతుంది సింహం.
అప్పుడే ఒక అందమైన కుందేలు కనిపిస్తుంది సింహానికి.  దాన్ని వేటాడ్డానికి వెళితే తప్పించుకొని పారిపోయిద్ది.
సింహం బాధ చూసి జాలేసి నక్క సింహం దగ్గరికి వెళ్ళింది.

“ఏంటి మహారాజా అందమైన కుందేలు తప్పిపోయిందని బాధపడుతున్నారా?” అని అడిగింది నక్క.
“అవును నాకు చాలా ఆకలి వేస్తుంది” అని బాధగా చెప్పింది సింహం

“మీరు బాధపడకండి మహారాజా. కుందేలుని నేను తీసుకు వస్తాను. మీరు వెళ్ళండి.” అని చెప్పి నక్క వెళ్లిపోయింది.
నక్క కోసం ఎదురు చూస్తూ చూస్తూ తన గుహలో నిద్రపోయాడు సింహం.

నక్క దాని స్నేహితులు కలిసి కుందేల్ని పట్టుకున్నారు. సింహానికి తీసుకు వెళ్ళకుండా వాళ్ళ తృప్తిగా కడుపు నిండ తిన్నారు.
ఇంక నీరసం మొహం వేసుకొని సింహం దగ్గరికి వెళ్లి “మహారాజా… మన పక్క అడవిలో ఉన్న చిరుత పులి కుందేలుని వేటాడి తినేసింది మహారాజా” అని అబద్ధం చెప్పింది నక్క.

“తనకి ఎంత ధైర్యం ఉంటే నా అడవిలోకే వచ్చి కుందేల్ని వేటాడి తింటుందా?” అనే కోపంతో రగిలిపోయింది సింహం.
సింహం వెంటనే చిరుత దగ్గరికి బయలుదేరుతుండగా

సింహం ఇప్పుడు చిరుత దగ్గరికి వెళ్తే అసలు నిజం తెలిసిపోతుంది అని అనుకొని , వెంటనే ఆపి “మహారాజా… మీరు ఇప్పుడే ఆవేశం పడిపోవద్దు ఒక మంచి అవకాశం చూసి చిరుతని దెబ్బ కొట్టాలి” అని చెప్పింది నక్క.

నక్క మాటలు గుడ్డిగా నమ్మి“హ్మా… సరే కానీ నాకు బాగా ఆకలి వేస్తుంది” అని చెప్పింది సింహం.“క్షమించండి మహారాజా… ఇప్పుడే మీకోసం ఆహారం తీసుకొని వస్తాను” అని చెప్పి వెళ్ళిపోయింది నక్క.

“నక్క బావ ఈ అడవికి నువ్వే రాజు అవ్వాలని ఇటు సింహాన్ని ఆకలిగా ఉంచుతూ, అటూ చిరుత మీద చెప్పుడు మాటలు చెప్పుతూ నువ్వు మంచి వాడివి అని నిరూపించుకుంటున్నావు” అని అన్నారు  నక్క స్నేహితులు.

“మరి లేకపోతే నేను చేసిన ఒక చిన్న తప్పుకే నన్ను ఈ అడవి నుంచి బయటికి పంపించేస్తుందా? ఊరికే విడిచిపెట్టను ఆ సింహాన్ని” అని కోపంతో చెప్పింది నక్క.

అటుగా వెళుతున్న కుందేలు వాళ్ళ మాటలు విని ఆశ్చర్యపోయింది. నక్క తన స్నేహితులకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుంది కుందేలు.

అయ్యో… ఇప్పుడు సింహం ఆకలితో ఉందా? వెంటనే ఆహారం తీసుకెళ్లి సింహానికి ఇస్తాను అని తనలోనే తాను అనుకుంటూ వెళ్ళింది సింహం దగ్గరికి వెళ్ళింది కుందేలు.

“మహారాజా… మహారాజా… ఇదిగోండి ఆహారం నక్క నా చేత పంపించింది” అని అబద్ధం చెప్పి ఆహారం ఇచ్చింది కుందేలు.ఆకలితో ఉన్న సింహం వెంటనే ఆహారం తీసుకొని తింటుంది.

“మన అడవికి కొత్తగా వచ్చిన నక్క వాళ్ళ స్నేహితులు మంచివాళ్లు కాదు మహారాజా” అని నాకు అనిపిస్తుంది అని చెప్పింది కుందేలు.

“మీకంటే ఎక్కువగా నామీద శ్రద్ధ చూపిస్తుంది. అందుకే తనమీద చెప్పుడు మాటలు చెబుతున్నావు” అని కోపంగా అన్నది సింహం.

“అది కాదు మహారాజా నేను చెప్పేది” అని కుందేలు చెప్పే అంత లోపు సింహం  ఆపి ఇంకేం” నాకు చెప్పాలనుకోకు ఇకనుంచి వెళ్ళిపో” అని కోపంగా చెప్పింది సింహం.

‘నాకు తెలుసు మహారాజా మీరు నా మాటలు నమ్మరు. అందుకే వాళ్లకు గుణపాఠం చెప్పడానికే నేను సిద్ధపడ్డాను అని అనుకుంది కుందేలు.’“నక్క బావ నిన్ను మన పక్క అడవిలో ఉన్న చిరుత పిలుస్తుంది” అని చెప్పింది కుందేలు.
“అవునా… నన్ను ఎందుకు పిలిచింది” అని అడిగింది అయోమయంగా నక్క.

“సరే నేను వెళ్తాను” అని చెప్పి చిరుత దగ్గరికి వెళ్ళింది నక్క.“ఏంటి చిరుత నన్ను పిలిచావంట?” అని అడిగింది నక్క.
“అవును నాతో చేతులు కలుపుతానంట మనం సింహాన్ని చంపేద్దాం” అని చెప్పింది చిరుత.

“నేను సింహాన్ని చంపేసి అడవికి రాజు అవ్వాలనుకుంటున్నాను. దానికి నువ్వు ఒప్పుకుంటే నేను నీతో చేతులు కలుపుతాను” అని చెప్పింది నక్క.

“నాకు ఇష్టమే ఇదే రాత్రికి నువ్వు సింహానికి ఏదో ఒకటి చెప్పేసి నా దగ్గరికి తీసుకొని రా “అని చెప్పింది చిరుత.
“అలాగే చెప్పి” వెళ్ళిపోతుంది నక్క.అర్ధరాత్రి అవుతుంది నక్క తన స్నేహితులతో సింహం గుహలోకి వెళ్లి సింహాన్ని చంపేస్తుంది.

సింహాన్ని చంపేసి చిరుత ఉన్న గుహలో పడేస్తారు. అడవిలో ఉన్న జంతువులన్నీ చూసి చిరుత ఈ తప్పు చేసిందని నిందించి చిరుతని బాగా కొడతారు.

జంతువుల మధ్యన ఉన్న నక్క స్నేహితులు అది చూసి ఎంతో ఆనంద పడుతున్నారు.కుందేలు వచ్చి ఆపండి ఎందుకు చిరుతని కొడుతున్నారు అని అడిగింది.

“మన అడవికి రాజైనా అయిన సింహాన్ని చిరుత చంపేసింది” అని చెప్పింది నక్క.హా అవును… హా అవును… జంతువులన్నీ అరుస్తూ మరి చెపుతున్నాయి.

“నన్ను చంపడం ఏంటి?” అయోమయంగా అడుగుతూ వచ్చింది సింహం.మరి చచ్చిపోయిన వారు ఎవరు అని నక్క అడిగి దగ్గరకు వెళ్ళి చూసింది. ఒకేసారి ఆశ్చర్యంతో“నా స్నేహితుని చంపేశారు” అని ఏడుస్తూ అడిగింది.

“మహారాజా… మిమ్మల్ని చంపడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారని నేను మీకు చెప్పి బయటకు తీసుకు వెళ్ళాను. కానీ మీరు నమ్మలేదు చూశారా?” అని అడిగింది కుందేలు.

అవును మహారాజా నేను కుందేలు ఆడిన నాటకం? మీ చుట్టూ ఉన్నవాళ్లు శత్రువులు. మిమ్మల్ని చంపాలని చూస్తున్నారు. మీ అధికారాన్ని పొందాలనుకుంటున్నారు.

కానీ మీరు మాత్రం మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళని నమ్ముతున్నారు.మీ చుట్టే మీకు తెలియని శత్రువులు ఉండి వెన్నుపోటు పొడుస్తున్నారు.

ఎవరిని అతిగా నమ్మకూడదు అతిగా చనువుగా ఉండకూడదు.నక్క స్నేహితున్ని ఎవరో చంపలేదు. వాళ్ళ స్నేహితుని వాళ్లే చంపుకున్నారు అని చెప్పింది చిరుత.

సింహం చుట్టే కాదు మనుషులు చుట్టూ కూడా శత్రువులు ఉండి మనల్ని నాశనం చేసి మన బాధను చూసి ఆనందిస్తారు.

 

-మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *