వెన్నెలలా గోదావరి

వెన్నెలలా గోదావరి

వెన్నెల్లో గోదావరి
చల్లగా ప్రవహిస్తుంది.
పోటొస్తే మునిగిపోతాం.
ఈత వస్తే బతికిపోతాం.
దూరంగా ఉంటే అద్భుతమే.
గోదావరి పొంగితే విషాదమే.
ఇలస చేపను పులసగా మార్చి
జనం మనసు గెలుచుకున్నది.
బాసర సరస్వతి మాత కాళ్ళు కడిగింది ఈ పుణ్య గోదావరి.
భద్రగిరిపై ఉన్న భద్రాద్రి రాముని రోజూ దర్శించే బంగారు తల్లి.
కోట్లాది మందికి తాగునీరు,
సాగునీరు అందించే కల్పవల్లి.

ఆ నదిని మనమేం చేస్తున్నాం?
కలుషితమైపోతున్నాయి ఆ
నది నీరు. వెన్నెల్లో గోదావరి
నదెంత అందంగా ఉందో.
అందంగా ఉన్న నది నీరెంత
చేదో.
గోదావరి నీరు కలుషితం
కానీయకుండా భవిష్యత్తు
తరాలకు మనమందజేద్దాం.

-వెంకట భానుప్రసాద్ చలసాని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *