వెన్నెల వెలుగు
ఈ వెన్నెల వెలుగులో కడలి అలల తాకిడిలో..
వన్నెలన్నీ ఒలకబోస్తూ నీకై వస్తోంది వయ్యారి
కన్నె గుండె చప్పుళ్లల్లో వలపు అలల అలజడి
నీ ఊహలతో ఉప్పొంగి ఉరకలేస్తోంది త్వరపడి
చిన్ని మనసా..కాసేపు ఆగవే అని అంటున్నా..
నా మది సాగర సంగమంలా కళ్లతోనే చేరె నీ ఒడి.
–గాయత్రీ భాస్కర్