వెన్నెల రాత్రులు
నిండు పున్నమి వెన్నెల
హాయి గొలుపుతూ ఆహ్వానించింది మది నిండుగా
వెండికొండల మెరుపులుగా
బింబమై ప్రతి బింభమై
నీటిలో నిన్నే చూస్తూ
అందానికి చందమామవై
వెలిగిపోతున్న రూపం
నది వొడ్డున నగిషీలు
వెన్నెల రాత్రులు
చందమామ బంతిని
తెచ్చి పెట్టిన రీతిలో
నిన్నుచూసిన కనులకు
నిజమైన అనుభూతి ఆహా
వెన్నెలంతా
చల్లని వెలుగులా……
– జి జయ