వెన్నెల జల పాతాలు
ఆ వెండి వెన్నెల జల పాతాల్లో…
మంచు కురిసే వెన్నెల వెలుగులో..
నీ కోసం ఎదురు చూస్తూ..
నీ జ్ఞాపకాల్లో తడిసి పోతూ..
చందమామతో కబుర్లు చెబుతూ..
గడిపిన ఆ అమృతపు రేయిని..
ఎలా మరువ గలను?
నువ్వు వద్దన్నా నీ కోసం ఎదురు చూసే ఆ తీయటి కమ్మటి రాతిరిని
నిదురమ్మను రానీయకుండా పహారా కాసే నా కాటుక కళ్లనీ..
ఎంత కోప్పడినా వినని నా మనసును..
ఎలా నచ్చ చెప్పను? నువ్వు రావని ఇక లేవని?
భారమైన మనసుకు బాధ్యతను అప్పగించి వెన్నెల జలపాతాలలో.
ఊరడిస్తున్నా!
ప్రియతమా! నీకు చూడగల శక్తి ఉంటే చూసి అభినందించు..
దీవెనలు ఇచ్చే శక్తి ఉంటే నీ దీవెనతో ఆశీర్వదించు…
అంతే చాలు మిత్రమా!!
– ఉమాదేవి ఎర్రం