వెండి జలపాతాలు
నీ నవ్వులే నాకు రహదారులు
నీ అడుగుల శబ్దాలు నాకు మధురోహాలు
నీ నును సిగ్గుల బుగ్గలే నాకు మందార మకరందాలు
నీ అధరాల జుంటి తేనె కమ్మదనాలే నాకు అమృతాలు
నీ మెడవంవులో దాగిన నా మోము పై కదలాడే నీ వెండి జలపాతాలే మన అందమైన ప్రేమకు గుర్తింపు,
ఆ వెండి జలపాతాలు నా మెడను తాకుతుంటే
తొలిరేయి నువ్వు సిగ్గుతో ముడుచుకున్న రోజులు
దగ్గరికి లాక్కోబోతే పెట్టిన పరుగులన్ని
ఇప్పుడు నేను నీ సమాధి పై దాచుకున్న గతకాలపు
జ్ఞాపకాలు…. చెలి మళ్లీ రావా నా కోసం నా వెండి జలపాతాల
లాంటి కురులు మళ్లీ నా మెడవంపులో చక్కిలి గిలి పెట్టిపోవా….. అంధుడైన నీ అర్ధభాగం నిను కలుసుకోవాలని
వేచి చూస్తోంది పండు వెన్నెలై…..
– భవ్య చారు
సూపర్ అక్క చాలా బాగా రాసారు 👌👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐