వెలుగులు
ప్రతిరోజు నాకోసం రెక్కలు విప్పుకొని వ్రాలు తున్నది ఓ తార తూరుపు దిక్కున….
నాతో కలసి అడుగులు వేస్తూ,
నేను అలసిన వేళ వాలుతున్నది పడమర వైపు….
నన్ను వదిలి వెళ్ళలేక వెళ్తూ వెళ్తూ వెండి వెలుగులు పంపుతున్నది….
తిరిగి చివరికు నాపై రాత్రి అనే దుప్పటి కప్పుతూ కమ్మని నిద్ర పుచ్చుచున్నది…!
-ప్రసాద్