వెలుగు చీకటి
సమీక్ష కోసం ఎంచుకున్న కవిత: వెలుగు చీకటి.
కవయిత్రి పేరు: బేతి మాధవి లత.
సమీక్షకురాలు: మామిడాల శైలజ.
బేతి మాధవిలత గారు వెలుగు-చీకటి అనే కవితను చక్కని సునిశితమైన వర్ణనతో హుందాగా రచించారు. వెలుగు చీకట్ల మధ్య దోబూచులాటతో కూడిన నిండు చందమామ వన్నె చిన్నెల సోయగాలను అత్యంత హృద్యంగా ఆవిష్కరించారు. అమావాస్య కారు చీకట్లను ఛేదించుకొని నెలవంకగా ప్రారంభమై క్రమక్రమంగా పరిపూర్ణమైన చంద్రబింబంగా దర్శనమిచ్చి మానవాళికి పాలవెన్నెల కాంతులను ప్రసాదిస్తున్న చందమామ అందచందాలను అపురూపంగా అభివర్ణించారు.
నక్షత్ర సమూహంలో రారాజుగా వెలుగొందుతూ శ్వేత వర్ణం తో పాటు ఎరుపు రంగు కలనేతతో ప్రజ్వలిస్తూ రోహిణి నక్షత్రంలో ఇంద్రధనస్సుపై అధిరోహించి భూలోకానికి ఆహ్లాదాన్ని పంచుతూ చంటి పిల్లల వెన్నెల మామగా పసిడి నవ్వులను వారి పాలబుగ్గలలో కురిపిస్తూ తల్లులకు పాల బువ్వ తినిపించడానికి సహకరించే ఆత్మీయ బంధువుగా మనసైన నేస్తంగా విరాజిల్లే ఆత్మీయ బంధువుగా అతి సుందరంగా, మృదులాలిత్యంగా మనసును ఆహ్లాదభరితం చేసేలా రచించడంలో కృతకృత్యులయ్యారు మాధవి లత గారు.
-మామిడాల శైలజ