వెలుగు చీకటి
ప్రకృతి అంతా
అమావాస్యతో
చిమ్మ చీకటితో అలముకుంటే..!!
నెమ్మది నెమ్మదిగా
రోజు రోజుకు చీకటి పారుదొల్లుకుంటూ
వెలుతురు తేలికవుతూ…
చంద్రవంక నుండి మొదలై
పరిపూర్ణ చంద్రుడువై
పూర్ణచంద్రుడిగా దర్శనమిస్తూ
నీలిమబ్బులలో పాల వెన్నెల వెలుగులు నింపుతూ..
నక్షత్రాల సామూహికంలో కలిసిపోయి ప్రకృతి నీ… మైమరిపించేలా…
వెలుగునిస్తూ…
చూడ చక్కని
చంద్రబింబమై శ్వేత వర్ణానికి ఎరుపు రంగు తోడై మెరుస్తూ 27 నక్షత్రాలతో కలిసి
నాట్యం చేస్తూ నీకు
ఇష్టమైన రోహిణి నక్షత్రముతో..
కలిసి ఇంద్రధనస్సు
పై కూర్చుని
పాల వెన్నెలలో
విహారం చేస్తూ భూలోకానికి పండగ వాతావరణాన్ని ఇచ్చి
పిల్లల కన్నుల్లో వెలుగుని నింపుతుంటే…!!
తల్లులు పాల బువ్వ
తినిపిస్తూ ఉంటే..!
వారిని చూసి సంతోషపడుతూ..
వారిని ఆశీర్వదిస్తూ..
మురిసిపోతుంటావు..
ఈలోగా అమావాస్య ఘడియలు ప్రారంభం
కాగానే కొంచెం కొంచెంగా
క్షీణిస్తూ చివరకు మాయమైపోతావు.
-బేతి మాధవి లత