వీలునామా

వీలునామా

రాత్రంతా జ్ఞాపకాల పహారాలో గడిపాను
ఎక్కడెక్కడి వారో పలకరించి వెళ్ళారు
ఆ పరిమళం ఇంకా వీడలేదు నన్ను
నిద్ర గొప్పది అప్పుడప్పుడు మేలు చేస్తుంది

పక్షుల కిలకిలలతో మళ్ళీ మనలోకంలో పడ్డాను
వెచ్చని కిరణాలన్నీ ప్రశ్నార్థకంగా చూస్తున్నాయి
కళ్ళలో ఆ మెరుపేమిటని
నేను మరచిన వారి జాడలవి అన్నాను

కాలం వేళ్ళసందుల్లోంచి జారే ఇసకలాంటిది
గ్రహించేంత వీలూ ఇవ్వదు
జ్ఞాపకాల వీలునామా భద్రపరుచుకుంటే

కృతజ్ఞతల వెన్నెల ఎప్పుడయినా కురిపించవచ్చు

– సి.యస్.రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *