వరాల కల్పవల్లివి
నేల గుమ్మడి నేలా గుమ్మడి
కాచావే నేల తల్లికి పూచిన వరమై…
చరణం : —
బరువని జారుకోని బంధాన్ని
వద్దని తెంచుకోని అమ్మ ప్రేమకు
గొప్పధనమై పెరుగుతు…పిలిచిన
ప్రతి నోటిన నిండుగా పండుతు…
కాలంతో నడిచిన నీ పయనం చెదరని
గమ్యంగా నిలిచిందోయమ్మా…
చరణం :—–
ప్రతి బతుకును నడిపించేవి
కోరికలు కావని వేదనగా చూడని
రోజంతా గుమ్మడిగా పూస్తుందని…
చక్కధనాల వెల్లువతో నిక్కమైనా
మనస్సుకు దగ్గరవుతు కలిగిన
ఆనందాన్ని సంబరంగా పంచుకో…
చరణం : —
ఆశలుగా పెంచుకొన్న తరుణాన్ని
బలమనుకొని తోరణాలుగా కట్టి
ఆకాశాన పందిరి వేయలేవు…
తెగిపోయిన బంధాలే జీవితానికి
పరమార్థాలైతే కరుణించని కాలం
పరుచదు నీకై దారులు…
చరణం :—-
చూపని కళ్ళకు నీ ఆకారమున
ముఖమెంతో పదిలమని పదికాలాల
దీవెనలకు నువు గుర్తుండే చిహ్నమని
ఎండినా నీ బతుకు నిండు నూరేళ్ళకు
నిలయమని మా మనస్సులు కొలిచేను
నిను గుడిలేని దేవతగా…
చరణం :—-
ఏ కొమ్మకో కాయాలనే కోరికలు
లేని నిండు వరాల కల్పవల్లివి…
నిత్య దర్శణాలతో శుభ సూచకమై
మనుషుల లోకం బాగుండాలని అవనికి
పచ్చధనాల దర్పణం బహుమానమై…
జాతి ధర్మాన్ని ఖ్యాతిగా పెంచుతున్నావు…
-దేరంగుల భైరవ
Bagundhi 👌👌👌👌👌👌