వసంతగానం
పచ్చని చెట్లన్ని మాయమయి పోయాయి,
మామిడి పూతంతా నేలరాలిపోయింది,
తెల్లని పందిరి వేసుకుని మురిసిపోయే,
వేపచెట్లన్నీ తెలియని వేదనలో మునిగిపోయాయి,
పూత లేని కాయలన్ని నేల రాలిపోయింది,
పిందెలన్ని రాలిపోయి రైతు నెత్తిన రాయిపడింది,
కళకళ లాడే ఇళ్లన్నీ నిశ్శబ్దంగా మారిపోయాయి,
పచ్చని పైరు నీరు లేక ఎండిపోయాయి,
కువకువ లాడే కోయిల గానం లేదు,
కా,కా అనే కాకి అరుపులు కూడా లేవు,
పచ్చని పైరు పంటలతో కళకళలాడుతూoడే
ఆ పల్లె పక్కనే కొత్తగా వచ్చిన కంపెనీ ఆ పల్లెను మార్చింది.
పచ్చగా నిగ నిలాడే చెట్లన్నీ ఎండిన ఎరుగప్పఅయ్యాయి
వసంతకాలoలో విరబూసే మామిడి పూత అంతా రాలింది.
తెల్లని పందిరి వేసుకుని మురిసిపోయే వేప పువ్వంతా
కారుమబ్బులు నల్లగా కమ్మినట్టుగా మాడిపోయాయి.
పిందెలురాలడంతో పంటచేతికి రాదని రైతు నెత్తిన పిడుగుపడింది. నవ్వుతూ, తుళ్లుతూ ఉండే ఆ పల్లె మూగబోయింది. అందరి మనసూ ఆవేదనతో నిండింది.
ఆ వేదన లోంచే పుట్టింది అవేశం,కంపెనీ వద్దంటూ ధర్నాలు
నిరసనలు చేశారు.తీసేయమంటూ పట్టు పట్టారు. నిరహార దీక్ష చేశారు.ఆత్మహత్యలుచేసుకుంటాముఅంటూ తెగించారు
వేదన విన్నవారు కంపెనీని మూయించారు. రైతుల కళ్ళల్లో
ఆనందం కనిపించింది.మళ్లీ చెట్లు చిగురించాయి.సంతోషంగా కోయిల గానం వినిపించింది. మళ్ళీ వసంత కాలం వచ్చింది…
-భవ్యచారు