వరుణుడి వాత్సల్యం!!
హోరెత్తెను నీ వెల్లువ,
ఈ పొంగు చూసి
రైతు ఇంట
పర్వాన్నము
పొంగి పారేను
పరవళ్ళై ………!
సాగవమ్మా,
నీకు అడ్డు ఎవరు…?
ఒంటరిగా వేణి వై
సంగమాన త్రివేణి వై
త్రిమూర్తులకు ధీటై
ఒక శక్తి వై సాగవమ్మా.
భూదేవి నోరు తెరచెను,
నేల నెర్రలు బాసెను,
నీ పరవళ్ళ తో
నింపుము దాని దోస్లిళ్లను.
నీకు కూడా తప్పనిది కష్టమమ్మా.
ఎండి ఆవిరై పోదువు.
కారు కన్నీరుతో
పరవళ్ళు తొక్కనీకు సాధ్యమా……?
వస్తాను నేను……….!
నీ కన్నీరు తుడిపివేయ
వరుణుడినై ………..!
– వాసు