వర్షంలో కష్టజీవుల
ఇంటిబయిటకు వెళ్ళలేరు
ఇంటిలోనే ఉండలేరు
కాయకష్టం చేస్తే గానికడుపు
నిండని బాధ జీవులు
బోధ పడని వర్షమేమో
జల్లు డల్లుగా కురుస్తుంటే
ఇంటిలోని పిల్ల జల్లా
కడుపునిండా తిండి
దొరకదు చేతినిండా పనులు
లేక చేసేదేమీ లేక ఆగవయ్యా వానదేవుడ
అని ఎదురుచూతురు
ఘడియైనా ఆగకుండా
గడియారపు జీవితాలకు
ఆకలే కాని ఆటవిడుపు
తెలియదు
సామాన్యుల వెతలు అన్ని ఇన్ని కావు కదా
జడివానతో అస్తవ్యస్తపు
దారులాయే
జన జీవనం కష్టమాయే
అధికవర్షంఅడ్డంకి ఆయె
మేఘానికి సందేశం
నీలాల నింగిలోనె
నీ పరుగు ఆపవయ్యా
వరుణ దేవా…….?
– జి జయ