వర్ణించలేని అద్భుతం

వర్ణించలేనిఅద్భుతం

మా ఇంట్లో జరగబోయే మొదటి శుభకార్యం కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. సంతోషం మాటలు వర్ణించలేనిది. చాలా రోజుల తర్వాత నేను ఊరు వెళ్ళబోతున్నాను. అని అక్కడ శుభకార్యానికి కావాల్సినవన్నీ చూడబోతున్నాను అని అనుకుంటునే ఎంతో ఆనందంగానే ఉంది.

పెళ్లి దగ్గరయ్యే కొద్ది ఎప్పుడెప్పుడు బయలుదేరుతామో అని ఆరాటం పెరిగిపోయేది నాకు. అయినా రోజులు దగ్గరయ్యే కొద్దీ ఎక్సైట్మెంట్ భరించలేకపోయాను.

వారం రోజులు తర్వాత బయలుదేరుతాను అనుకునే టైంలో ఒక సంఘటన వల్ల నేను ఊరు వెళ్ళలేకపోయాను. ఆ బాధ మాటల్లో వర్ణించలేనంతగా బాధపడ్డాను.

పెళ్లిలో జరిగే ప్రతిఘటంలో నేను ఉండాలి అనుకున్నాను కానీ పరిస్థితులు అలా జరగనివ్వలేదు. వీడియోలు చూసిన ప్రతిసారి అక్కడ లేనే అని బాధ కలిగేది.

పెళ్లి అయిన తరువాత ఇంట్లో గొడవలు. ఇద్దరు మధ్య నేను చాలా నలిగిపోయోదాన్ని.

“నాన్న నేను కొన్నాళ్ళు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఇక్కడ ఉండలేకపోతున్నాను” అని చెప్పాను. నాన్న మాత్రం “వద్దు అమ్మా ! కష్టమో , నష్టమో మన ఇంటి విషయాలు తనకి చెప్పవద్దు” అని నాకు చెప్పారు.
సరే లే నాన్న అని సైలెంట్ గా ఉన్నా.

అక్క అప్పుడప్పుడు ఫోన్ నిన్ను మా ఇంటికి తీసుకొని వెళతాము అని చెప్పిన ప్రతిసారి కొత్త ఆశలు నా మనసులో కలిగేవి. బావ గారికి మేము ఉన్న దగ్గరకు బదిలీ కావడం వల్ల నా ఆనందానికి మళ్ళీ రెక్కలు వచ్చాయి.
తను కడుపుతో ఉండడం వల్ల నా ఆనందానికి హద్దులే లేవు..

ఏడవ నెలలో సీమంతం జరిపి మా ఇంటికి తీసుకొని వచ్చారు. రెండు నెలలు తరువాత బాబు పుట్టాడు.
వాడి మొదటి సారి నా చేతులోకి తీసుకున్నప్పుడు కొంచం షాక్ గా ఇంకొంచం ఆశ్చరం కలిగింది.

ఆ అద్భుతమైన సంఘటనని మాటల్లో చెప్పలేను.వాడి చిన్న చిన్న చేతులను పట్టుకొని ముద్దు పెట్టుకున్నా.. వాడిని తాకాలంటే కొంచెం భయమేసేది..
ఇప్పుడు వాడితోనే రోజులు గడిచిపోతున్నాయి.
వాడి ఉంటే ఒక ఆనందం. మా అమ్మానాన్నలు వాడి ఒక గంట అయిన ఆడిస్తారు.

ఇలా నా జీవితంలోజరిగిన అద్భుతమైన సంఘటన అని చెప్పాలి..

దేవుడు కొన్నిటిని దూరం చేసిన కావలసింది ఇచ్చాడు అని చెప్పుతారు. అలాగే ఇంట్లో జరిగిన పెళ్లికి వెళ్ళలేకపోయిన అంతకంటే ఎక్కువగా నా ప్రేమని తీసుకోవడానికి వచ్చాడు అక్క బాబు.. వాడు నా జీవితంలో వర్ణించలేని అద్భుతంగా మిగిలిపోయాడు.

 

-మాధవి కాళ్ళ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *