వాలుజడ
మా మామయ్య అంటే మాకు చాలా ఇష్టం అందరు మామయ్యల్లో చిన్నవాడన్నమాటమళ్లీ ఎంత మంది మామలని మీకు డౌటు కదా! ముగ్గురు మామయ్యలు మా అమ్మకు ఇద్దరు అన్నయ్యలు ఒక తమ్ముడుఆ చిన్న తమ్ముని సంగతే ఇప్పుడు చెప్పేది..
తనకు పెళ్లి చూపులట అంతకు ముందు ఓ రెండు సంబంధాలు చూసాడట నచ్చలేదు ఈ మూడో సంబంధానికి వరంగల్ వెళ్లాడటఅమ్మాయి వాళ్లింటికి వెళ్లాడట అయితే ఎదురుగానె ఒకమ్మాయు జుట్టు ఆరబెట్టుకుంటూ కనిపించిందట..
ఆమెనే లోపలికి రావచ్చా? అని అడిగాడట వెనుకకు తిరిగి రండి అని తుర్రుమని లోపలకు పారిపోయిందట..
తరువాత పొడుగాటి జడ వేసుకుని మళ్లీ ముందుకు వచ్చిందట ఆ వాలు జడ నచ్చే మా మామయ్య తనను ఒకె చేసాడట..
పెళ్లయైపోయింది పిల్లలు పుట్టడం కాలక్రమేనా జుట్టంతా ఊడిపోయింది..
ఇప్పుడు ఆ వాలు జడ చూసే పెళ్లి చేసుకున్నా! జడ లేదు వదిలేద్దామా? అంటాడు మాతో సరదాగా!
మా మామయ్యకు 80 యేళ్లు అత్తయ్యకు 74 ఇద్దరూ పార్వతీ పరమేశ్వరుల్లా బాగుంటారు..
ఏంటో! వాలు జడ అంటే మా మామయ్య అనే ఆ సరదా మాటలు గుర్తొచ్చి ఇలా రాసాను..
-ఉమాదేవి ఎర్రం