వలస కూలీల వదనం
వలసకూలీలవరం పట్టణం
బ్రతుకుదెరువే అయితే భారం
కాలగమనంలో పరిస్థితులు తారుమారు అయితే
ఏ దారిలేక రహదారివెంటే
సొంత ఊరు మార్గం వెతుక్కుంటూ
గూడు లేక గోడు వినని
పిల్లాపాపలతో పెట్టే బేడలతో
బ్రతుకు జీవుడా అని
భయమే భవిష్యత్తు అయి
అడుగులు పడుతున్న వేళ
కాలం పగబడితే గమనం మారుతూ పొట్టకూటికై
పొర్లుదండాల పయనం
ఆశ్రయం కోసం ఎదురు చూస్తూ
బ్రతుకు భారాన్ని మోస్తూ
బ్రతుకు భరోసా ఎక్కడా అని
విది గీసిన గీతలను దాటుతూ
నుదుటి గీతలను వెక్కిరిస్తూ
పొలిమేరలకు చేరుతున్నాయి చితికిన బతుకులు.
– జి జయ