వలస పక్షులు
ఎడారులు ఎక్కడోలేవు
నగరాలే ఇప్పుడు కాంక్రీటు ఎడారులు
తడారిపోయిన గుండెల్లో
అందని ద్రాక్షపళ్ళలా ఆకాశహర్మ్యాలు
అలజడి సంకేతాలు
తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీల్లా
సొంత చిరునామాలేని ఈ వలసపక్షులు
నిర్వికారంగా సాగే గమ్యంలేని బాటసారులు
సాదా సీదా మనుషులు కదా
చీదరించుకుంటాం
-సి.యస్.రాంబాబు