వైఫల్యాలు
ఆపద చెప్పిరాదు
వైఫల్యం శాశ్వతం కాదు
అంటారు పెద్దలు
గెలుపు పరుగులకు వైఫల్యాలే మైలురాళ్లు
ఎదుర్కొనే సాహసం ఉండాలి కానీ వైఫల్యమే లక్ష్యానికి టానిక్ లా పనిచేస్తుంది
భరించడం కష్టం కానీ
అంగీకరించక తప్పదు
వైఫల్యాలు అధికమిస్తేనే అత్యున్నత స్థానం దక్కుతుంది
వైఫల్యం నుండి నిరాశ కలిగినా ధైర్యంతో ముందడుగు వేయాలి
ప్రయత్నాల ఫలితం తారుమారైన గెలవాలన్న తపన శక్తిలామారుతుంది
వైఫల్యాలను పాఠంగా తీసుకొని అవకాశాలను అందిపుచ్చుకొని లక్ష్యాలను సాధించాలి
వైఫల్యమే ఒక అనుభవం అయితే కొత్త ఆలోచనలే మార్గం కావాలి
వైఫల్యం విషాదాలకు విస్తరి వేయకుండా
సరియైన మార్గానికి బాధ్యత వహించాలి
విశ్లేషనే విధానం అయితే సమర్థతే సానుకూలం
అవుతుంది
పోటీ ప్రపంచంలో ఎదగాలంటే వైఫల్యాలనుండి పాఠాలు నేర్వాలి
ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుని విజయాల మెట్లు వెతికి తీరాల్సిందే
మారిన జీవితాలన్నీ వైఫల్యాల నుండే తీర్చిదిద్దబడినవే మరి…..
– జి జయ