వడ్ల గింజలో బియ్యపు గింజ
భార్య :
భార్య భర్తలన్నాక ఏవో చిన్న చిన్న కీచులాటలు
పొట్లాటలు ఎవరి అహం వారు నిలబెట్టుకోవాలనే
తాపత్రయంలో వస్తుంటాయి గదా! అది
సహజమేగదా!వడ్ల గింజలో బియ్యపు గింజ.
చివరికి అంతే అని మనకు తెలుసు. కాని చిలికి
చిలికి గాలివాన అయినట్లు కొంతమంది కోర్టులకి
కూడా పోతూ వుంటారు ఇది అసహజం గదా!
కాబట్టి,ఇకనుంచి నా అహం మీరు
నిలపెట్టటానికి
ప్రయత్నించండి,నేను మీ అహం నిల పెట్టటానికి
ప్రయత్నిస్తాను ఇంక ఏ గొడవలు వుండవు.ఆదర్శ
దంపతులుగా పేరు తెచ్చుకొందాం!ఏ చీకు చింత
లేకుండా ప్రశాంతంగా ఉందాం!
భర్త : నీ ఉపన్యాసం బాగుంది.కాని ను
వ్వేదోఒకటి అంటూ ఉంటావు, ప్రశాంతంగా
ఉండనివ్వవుగ దా!
భార్య : మీరే ఎదో ఒకటి అంటుంటారు
నసుగుటుంటారు, ప్రశాంతంగా ఉండనివ్వరు.
భర్త : నువ్వొక నస.
భార్య:నువ్వే ఒక నస.
భర్త : నువ్వే!
భార్య : నువ్వే!
భర్త : భర్తని భార్య గౌరవించాలి
భార్య : భార్యని భర్త ప్రేమగా చూసుకోవాలి
భర్త : భర్తని భార్య ముందు గౌరవిస్తే నే గదా
ప్రేమగా చూసుకొనేది!
భార్య : భార్యని భర్త ముందు ప్రేమగా
చూసుకొంటే నే గదా గౌరవించేది!
భర్త : నీవొక అడివి మనిషివి.వామ్మో!
భార్య : నీవొక అడివి మృగానివి.
ఉష్! హమ్మయ్య!( చివరి మాట
తనదైనందుకు మురిసి పోతూ )
– రమణ బొమ్మకంటి