వద్దురా వద్దురా అప్పుజీవితం
నేడు అప్పు…”అమృతంరా”…
రేపది “పచ్చివిషం” చిమ్మురా…
నా ఈ మంచిమాట నమ్మురా…
నేడు అవసరాలకోసం
ఆశతో “అప్పుల వల”
విసిరేది నువ్వేరా…
రేపు ఆ వలలో చిక్కుకుని
విలవిలలాడేది నువ్వేరా…
నేడు అప్పు…”తిరుపతి లడ్డురా”…
రేపది జీవితాంతం…”వదలని జిడ్డురా”…
నేడు అప్పు…చేయడం ఒక “హాబిరా”…
రేపది…నీ ఊపిరి తీసే ఒక “ఊబిరా”…
నేడు అప్పు…
పరిమళించే “గంధపు చెక్కరా”…
రేపది కాలేసి
జర్రునజారిపడే “అరటి తొక్కరా”…
నేడు బ్రతుదారిలో
“అప్పుల అరటి తొక్కను”
విసిరేది నువ్వేరా…
రేపు “కాలుజారి”పడి
నలుగురిలో…నవ్వుల
పాలైపొయ్యేది నువ్వేరా…
వద్దురా వద్దురా..!
మెప్పుకోసం అప్పుజీవితం..!
నేడది ఉప్పురా….రేపది తప్పురా..!
నేడది తప్పైతే…..రేపది ముప్పురా..!
నేడది ముప్పైతే…రేపది ఆరని నిప్పురా..!
నేడు అప్పు…”కానరాని కారుచిచ్చురా”…
రేపు…తీర్చుకున్న నీమెడకది “ఉచ్చురా”…
అందుకే వద్దురా…వద్దురా…
“మెప్పుకోసం ఈ అప్పుజీవితం” వద్దురా..!
-గంధం గురువర్ధన్ రెడ్డి
Chala chala bhagundhi 👌