వచ్చింది వచ్చింది..
వచ్చింది వచ్చింది.. నిన్ను వీడని నీడను నేనే.. అంటూ అక్క పోయి చెల్లిని పంపిచింది…
మరువలేని మహమ్మారి.. మనల్ని విడిచి ఉండను అంటుంది.. మనం చేసుకునే పనులు చాలక మనకే పనుల్ని చెప్పడానికి వచ్చింది….
బ్రహ్మం గారు చెప్పిన మాటలును గుర్తు చేయడానికి, మన కనీస ధర్మాలను పాటించమని చెప్పడానికి ఆఘమేఘాలు మీద… అక్క మీద అలిగి.. చెల్లి ఇంకొసారి వణికించడానికి వచ్చింది.. అయినా
మనం తక్కువ ఏంటి? అక్కా , చెల్లి దాని తల్లి ఎవరు రాని… ఎదురు నిల్చి ఎగరగొట్టేదాం…. కరాలు కడిగి, కనీస దూరం పాటించవోయి… రిలాక్స్ అయి రిమిక్స్ విందాం అనుకునే లోగ.. రయ్యి రయ్యి మంటూ రంకెలేస్తూ వచ్చేసింది.. మహమ్మారి ని మడుగున పెట్టే సూచనలును తిరిగి గుర్తు చేయడానికి వచ్చింది… అదేనండి… ఓమిక్రాన్ Bf7
– తోగారపు దేవి