వచ్చే పోయే వాన

వచ్చే పోయే వాన

 

వచ్చే,వచ్చే వాన , పాయె పాయె వాన , నీ అవ్వ ఈ వేడి కి సళ్లగ ఉంటది అని అనుకుంటే ఇట్లా వడి అట్లా పోయిందేమే అన్నాడు చిన్నోడు.

అవునూ బిడ్డ మస్తు ఉడుకు తుంది. ఈ వాన గొట్టి పోతే ఇంకా ఉడుకుతది అన్నది అమ్మ , అవునే గీ వాన రాక పోయినా బాగుణ్ణు ,అచ్చి సతయింపుడు కాపోతే పడితే పడింది కాదు పోతే వికింది కాదు. ఉరిముతుంది గానీ పడ్త లేదు. గి ఉడుకు నా వల్ల కాదు గని పోతాం పా అన్నాడు వాడు.

ఏడికి రా గోప్పడిది గిట్ల ఏడికనీ పోతాం అంది అమ్మ , యే నువ్వొక దానివి ,మా దోస్త్ ఉర్ల వాళ్ళ కు పొలం కూడా ఉంది.పోయి నాలుగు రోజులు ఆ పొలం కడ ఉండోత్తాం పా , అగో బిడ్డ ఉర్లే ఉన్న ఇల్లు గానికి ఎవనికో నమ్మితివి , ఇప్పుడు గా దోస్తు ఎవరో ఇంటికి పోదాం అనవడతివి అంటూ ఆశ్చర్య పోయింది అమ్మ.

ఇగో అమ్మ గవన్ని ఎందుకే నీ ఇల్లు నీకు ఇప్పిత్తా, ఇగ మల్ల గా ముచ్చట తియ్యకు , దోస్తు అంటే మా ఆఫీస్ ల పని చేసే దోస్తు . మొన్ననే పరిచయం అయ్యిండు, అల్ల ఇంట్ల ఏదో దావత్ ఉన్నది అంటే అమ్మను దొల్కొని అస్త అని అంటి, గందు కే పోదాం అంటున్న ,

నీ యవ్వ పోరడ , నాకేంమో ఫికర్ అయ్యితుoటే, నువ్వేమో అయిత లేవు , ఇల్లు ఇడ్చి ఎట్లా ఉండబుద్ధి అయితoది రా నీకు, వాన రాకడ  పానం పోకడ ఎవలికి తెల్వద్ అంట అదేదో నా ఇంట్ల నే పోవాలని ,అంటూ అమ్మ కళ్ళు ఒత్తుకుంటూ, అవునే నీకూకే ఏడుపు అస్తది. కళ్ళల యమున ను దాసుకుంటివి మల్ల అని కళ్ళ ముందు ఏదో ఆడించిండు, అరే ఏంది రా అది సూపియ్యి అంది అమ్మ , మరి నువ్వు ఎడ్వవ్వద్దు అన్నాడు చిన్నోడు. సరే తియి ఎడ్వ గని సూపీయ్యి అంది.

ఇగో అంట ఇల్లు తాళం సేతులు తిప్పుకుంటూ అమ్మ సేతి లో ఎట్టి కాళ్ళు మొక్క వట్టే , లే బిడ్డ లే పా , పోదాం పా మనింటికి మనం అంటూ అమ్మ లేచింది. అమ్మ పోదాం తి అగు మా దోస్త్ కారు దేనికి పోయిండు, పోదాం అగు జర అనంగనే అమ్మ ,కొడుకుల కన్నుల నుండి నీళ్ళు రావట్టే ,

 

-భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *