వాస్తవం …..?
నా పేరు అరుణ్. నేను అందరితో సులభంగా కలిసిపోతాను. నా ప్రవర్తన వల్ల నేనంటే మా పాఠశాలలో చాలా మందికి ఇష్టం. ప్రతీ ఒక్క ఉపాధ్యాయడు, ఉపాధ్యాయురాలు నన్ను సొంత కొడుకులా చూసుకునేవాళ్ళు. నేను 9వ తరగతి చదివేటప్పుడు ఉపాధ్యాయుల బదిలీ జరిగింది. కొంత మంది కొత్త ఉపాధ్యాయులు వచ్చారు.
మాకు ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా శ్రీమతి భవానీ మేడమ్ గారిని ని నియమించారు. తనకు పిల్లలంటే చాలా ఇష్టం, ఆవిడకి పిల్లలంటే అమితమైనా ప్రేమ. తన విద్యార్థులు ఎక్కడున్నా బాగుండాలి అని కోరుకొనేది. నాకు 2 సంవత్సరాలు విద్య నేర్పింది. మేము ఎన్ని తప్పులు చేసినా క్షమించేది. ఎంత అల్లరి చేసినా కోప్పడకుండా చదువు చెప్పేది. తను మాకు చాలా దగ్గరైపోయింది ఎంతలా అంటే నేనైతే అమ్మలా అని చెప్తాను అంత దగ్గరైంది. విద్యార్ధులకి ఎటువంటి సమస్య వచ్చినా తను పరిష్కరించేది.
10వ తరగతి పూర్తయిన తరువాత 4 సంవత్సరాలకి నేను నా ఇద్దరు మిత్రులు (శివకుమార్ మరియు రాహుల్) తో కలిసి మా ఉపాధ్యాయురాలు భవాని మేడమ్ గారిని కలవడానికి వెళ్ళాము.
భవాని మేడమ్ గారు ఎంతో ప్రేమగా అప్యాయంగా పలకరించారు. ఒకరికొకరము క్షేమసమచరాలు అడిగి తెకుసుకొన్నాము. నేను మా మిత్రులు మా జీవితంలో జరిగిన కొన్ని చేదు సంఘటనలు మేడంతో చెప్పుకొన్నాము. బయట సమాజం ఒక చిన్న కథ చెప్పాము.(యువకుల ప్రేమ అవ్వడం గురించి చెప్పాము) ఇంట్లో తల్లిదండ్రులు తమ ఆడ పిల్లల గురించి ఏమనుకొంటున్నారో మాకు తెలియదు.
కానీ సమాజంలో కొంతమంది యువకుల జీవితాలు ఛిన్నాభిన్నం కావడానికి అమ్మాయిలు కూడా కారణం అవుతున్నారు అని చెప్పాము. ఈ అంశం తో మేడం ఒప్పుకోలేదు. సాయంత్రం కావడంతో అక్కడితో సంభాషణ ముగించి చిరునవ్వుతో వెళ్ళివస్తాము మేడం అని చెప్పి పాఠశాల నుండి వెళ్ళిపోయాము
4 రోజుల తరువాత ఉదయం నాకు అన్నౌన్ నంబర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో తెలుసుకుందాము అని మాట్లాడాను. అది ఎవరో కాదు మా ఉపాధ్యాయురాలు భవానీ మేడం గారు. “నాన్న మీరు ఒకసారి పాఠశాలకి రండి మీతో మాట్లాడాలి” అని చెప్పింది. ఉదయం 10.00 గంటలకి నేను మేడం ని కలవడానికి వెళ్ళాను. నా మిత్రులు రాలేకపోయారు పాఠశాలకి .
నేను ఒక్కడినే వెళ్ళి మేడం ని కలిసాను. అప్పుడు తను ఇలా చెప్పింది “ఇంట్లో తల్లిదండ్రుల ముందు ఎంతో చక్కగా, సంస్కారంగా వుండే అమ్మాయిలు స్కూల్ డేస్ లోనే ప్రేమించడం ఏమిటి..? ఉపాధ్యాయులతో చక్కగా అమ్మాయిలు ఇంకొకరి దుఃఖానికి కారణం అవుతున్నరా” అని ఆలోచించింది.
అందుకు బదులుగా నేను ఇలా అన్నాను. “ప్రస్తుత సమాజం ఎలా వుంది అని పెద్ద వాళ్ళని వృద్ధులను కాదు విద్యార్థులను అడగండి. ఉపాధ్యాయులు పాఠశాలలో నేర్పే సంస్కారం, పధ్ధతి వేరు. బయట సమాజం లో వున్న పద్ధతులు వేరు అని చెప్పాను
***********
ఈ కథ ఉపాధ్యాయురాలికి విద్యార్థి యొక్క స్నేహాన్ని తెలియచేస్తుంది. ఎవరినీ ఉద్దేశిస్తూ రాసింది కాదు. ఎవరినీ తక్కువ చేస్తూ చెప్పాలని కాదు. సమాజంలో ఏమి జరుగుతుందో తల్లిదండ్రుల కూడా గమనించాలి అని రాసాను. ఇది నా జీవితంలో జరిగిన చిన్న సన్నివేశం మాత్రమే….
– M తిప్పేస్వామి