వాగ్దానం
సంతోషంలో వాగ్దానం చేయొద్దు
కోపంలో మాట మాట్లాడవద్దు అంటారు
అతి తేలికైన విషయంగా కనిపించినా అది ఒక పెద్ద
బూతద్దం లాంటిది
కోరికతో చేసే పని అయినా
వినడానికి బానేవున్నా
ఫలితానికి దూరంగా కనిపిస్తుంది
నిజానికి ఎదుటి వారు చేసే వాగ్దానం
బాణం లా వెలుతుందట
ముందుచూపు లేని మాట
ఆచరణ లేని అవకాశము ఒక్కటే
కొన్నిసార్లు భ్రమ కల్పించే
వాగ్దానాలు పశ్చాతాపం
స్నేహ బంధాలు అనుబంధాలలో కూడా
ప్రతిబంధకంగా నిలుస్తాయి
వాగ్దానాలు ప్రమాణం లేని
స్వప్నం కాకుండా ఫలితాన్ని
ఇచ్చే ఆచరణలో ఉండాలి, కానిచో
వర మిచ్చిన వాగ్ధానినికే
శాపమవుతుంది.
– జి. జయ