ఉషోదయo
కొక్కోరోక్కో అని కోడి కూసే వేళ…
బామ్మ నిదురలేచి పొయ్యి అలికె వేళ…..
అమ్మ లేచి ముంగిళ్లో ముగ్గు పెట్టు వేళ…
నాన్న లేచి నట్టింట్లో నడిచిన వేళ….
ఉషస్సు వొలికె ఉషోదయ కిరణాల ఉలుకులు….
పట్టణ ప్రపంచ బంధం కన్నా….
హడావిడి లేని వేకువజాము రేయికి నిద్రలేచి….
బిక్కు బిక్కుమని సమయాన్ని వృద్ధ చేయకుండా తమ పనులకై సిద్ధం అయి…
పాపయ్య పొలంకి వెళ్లి…
నర్సమ్మ నీళ్ల రేవుకు వెళ్లి….
కోటమ్మ కోళ్లను వదలాలా వద్దా…
అని అయోమయం ఆలోచనల్లో…
ఉషోదయ కిరణాలను దాటి…..
ఉదయ కాంతి కోసం వేచి చూసే….
తూర్పున ఉదయించే సూర్యకాంతి కిరణాలు గుమ్మంలోకి తెచ్చే కొత్త వెలుగు….
చీకటిని అదిమి జీవరాశి మనుగడును మొదలు పెట్టే ఈ ఉదయ కాంతులు….
– తోగరాపు దేవి