ఊరటనిస్తాడు

ఊరటనిస్తాడు

నిర్భయ మౌనిగ
చిరునవ్వులతో
నిలబడతాడు
మనలను నిలబెడతాడు

వేదనలన్నీ దోసిట పట్టి
భుజమును తట్టి
ధైర్యమునిచ్చి
దారిని చూపే దైవం

అలసిన మనసుకు
ఊరటనిచ్చి
అలుపు సొలుపు తీరుస్తాడు
బుద్ధదేవుడా బుద్దిని ఇవ్వు

కలలే మరచిన కాలంలో
కలిసి రాని మనుషులతో
కలతే చెంది నువ్వుంటే
పదమంటాడు
లేలెమ్మంటాడు

 

-సి.యస్.రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *