ఉప్పొంగిన గోదారి

ఉప్పొంగిన గోదారి

రాజమండ్రి దగ్గర లోని ఒక చిన్న పల్లె ఆ పల్లెలో పక్క పక్క ఇల్లే రాముడు, లక్ష్మి ది. చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగారు. వయసు పెరిగే కొద్దీ ఇద్దరి మధ్యా స్నేహం తో పాటు ప్రేమ కూడా పెరిగింది. అది ఇరు పెద్దలకు కూడా తెలిసింది. ఇరు కుటుంబాలు కూడా పెద్దగా ఉన్న వారు కూడా కాదు. వారి జీవనం ఒక్కటే గొదర్లో చేపలు పట్టడం అమ్ముకుని జీవనం సాగించేవారు.

వారిద్దరి సంగతి ఇద్దరి కుటుంబాల వాళ్ళకి తెలిసింది కాబట్టి మంచి ముహూర్తాలు చూసి లగ్నాలు పెట్టించారు. ఇక లగ్నాలు పెట్టించాక ఆ ఇద్దరి ప్రేమికులకి అడ్డు అదుపు లేకుండా పోయింది. గోదారంతా వారిదే అయింది చెట్టు చేమా నీరు నిప్పు పంచభూతాలు వారి ప్రేమకు సాక్ష్యం అయ్యాయి. ఒకరినొకరు అల్లరి చేసుకుంటూ పట్టుకోవడానికి పరుగులు పెడుతూ గోదారి వెంట పరుగులు తీస్తూ అలుపు వచ్చేదాకా ఆడుకునేవారు.

ఆ తర్వాత అలసిన రెండు శరీరాలను ఇసుకమేటలో వాలేసి ఆ నింగి ఈ చంద్రం ఎప్పటికైనా కలుస్తుందా అని లక్ష సందేహాలతో వెలుగుచుకుంటూ వాటికి జవాబులు వెతుక్కుంటూ ఒకరికొకరు సమాధానాలు చెప్పుకుంటూ సంతోషంగా కలుముషం లేని వారి ప్రేమతో గోదారమ్మ ఉప్పొంగిపోయేది. ఆ చిన్నారి ప్రేమికులను చూసి మురిసిపోతుంది గోదారమ్మ తల్లి.

ప్రతిరోజు వారి ఊసులు వినకుండా అసలు ఉండేది కాదు వారి ఊసులు తనకు వినిపిస్తున్నాయి అన్నట్లుగా అలల శబ్దం చేస్తూ ఉండేది అది గమనించినే రాముడు చూసావా గోదారమ్మ కూడా మన మాటలు వింటుందే లక్షి అంటూ లక్ష్మిని ఆటలు పట్టించేవాడు వింటే వినని ఆ అమ్మ కూడా మన ప్రేమకు సాక్ష్యమే కదా మామ అంటూ లక్ష్మీ సిగ్గుపడిపోయేది సిగ్గుపడుతున్న లక్ష్మీని అల్లుకుపోయేవాడు రాముడు.

అలా వారిని ప్రేమ ముదిరిపాకన పడిపోయి లగ్నాల కూడా దగ్గరపడ్డాయి. ఇక రెండిళ్లలోనూ సందడి మొదలైంది. పెళ్లికి కావాల్సిన బాజా భజంత్రీలు బట్టలు, పుస్తెలు వంట సామానులన్నీ రెడీ అయ్యాయి అమ్మ లెక్కలు లక్ష్మీని పెళ్లికూతురులా ముస్తాబు చేశారు మరోవైపు రాముడు ఇంట్లో రాముడిని కూడా పెళ్లి కొడుకుని చేయాలని చూస్తున్నారు. అంతా తయారైపోయారు అమ్మలక్కలంతా పెళ్ళికి ముహూర్తానికి మండపం దగ్గరికి వచ్చారు.

రాముడు పంతులు చెప్పే మంత్రాలను వింటూ పూజలు చేస్తూ ఉంటే అమ్మలక్కలు లక్ష్మిని తీసుకొని వచ్చారు సిగ్గులువలకబోస్తూ వస్తున్న లక్ష్మిని చూసి ఆశ్చర్యపోయాడు రాముడు నా లక్ష్మీ ఇంత అందంగా ఉందా ఎప్పుడు లంగా జాకెట్ లో చూడడమే తప్ప చీరలో చూడడం ఇదే మొదటిసారి ఎంత అందంగా ఉంది అని అనుకుంటూ మైమరిచిపోయాడు రాముడు.

సరిగ్గా పూజారి గారు రాముడు చేత లక్ష్మికి పుస్తే కట్టించే సమయానికి బయట ఏదో కల్లోలం వినిపించింది. ఏమైంది అంటూ అందరూ రాముడుని లక్ష్మి ని అక్కడే వదిలేసి పరుగులు తీశారు. రాముడికి లక్ష్మికి ఏం చేయాలో అర్థం కాలేదు అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతే తామద్దరు మాత్రమే మిగిలారు ఇద్దరు ఒకరి కలలోకి ఒకరు చూసుకుంటూ సిగ్గులు పడుతూ రాబోయే రోజులను తలుచుకుంటూ ఊహల్లో తేలిపోతున్నారు.

ఒరేయ్ రాముడు లేరా లే పరిగెత్తు పరిగెత్తు గోదారమ్మ ఒప్పొంగింది దగ్గరికి వచ్చేస్తోంది. లెగెత్తండి ఇద్దరు అంటూ ఎవరో గట్టిగా అరిచేసరికి ఈ లోకంలోకి వచ్చారు రాముడు, లక్ష్మి. అప్పటికే సగం గోదారమ్మ వాళ్ల గుడిసెలోకి ఉప్పుంగుతూ వస్తోంది సగం గుడిసెలన్నీ నీటితో నిండిపోయాయి. పెళ్లికి వచ్చిన పిల్లలు పెద్దలు అహంకారాలు చేస్తూ దొరికిన తట్టాబుట్టాలన్నీ సదురుకొని ఎగువ వైపు పరుగులు పెడుతున్నారు.

వీరినెవ్వరూ పట్టించుకోవడం లేదు ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవాలని ప్రయత్నం వల్ల అందరూ అక్కడి నుంచి పరుగులు పెడుతున్నారు. రాముడు సీత ఊహలోంచి బయటపడి తాము కూడా లేచి వెళ్లాలనే ప్రయత్నం చేశారు కానీ అప్పటికే నీళ్లు మండపాన్ని మొత్తం ముంచేసాయి బతకడం కష్టం అని అనుకున్న ఆ ఇద్దరు ప్రేమికులు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఒకరు కలలోకి ఒకరు చూసుకుంటూ వచ్చే జన్మలో అయినా కలిసి బ్రతకాలి అనే ఆశను కళ్ళలో నింపుకొని ఆ గోదారమ్మ ఒడిలోకి జారిపోయారు మౌనంగా… ఇద్దరు కల్మషం లేని ప్రేమికులు బయట ఉండడం నచ్చని గోదారమ్మ వారిని తనలోకి దాచుకుంది.

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *