ఉప్పెన
మొదలుపెట్టాను చిందరవందర మదితో
ఒకపట్టాన వదలని గజిబిజి ఆలోచనలతో
మరి నా గుండెలోతుల్లో భావమానే….
భారాన్ని మోయగలిగే అక్షరాలేవి….?
మెదడు పోరల్లోని ఆరటాన్ని ….
కూర్చగలిగే పదాలేవి…..?
ఊహకు అందని ఉప్పెనలా …
ఉవ్వెత్తున ఎగసిపడే
ఓ తుంటరి మనసా….
తెలుసా నీకైనా నా చింతకు కారణం
మొదలో తుదలో ….
లేని తలపులలో చిక్కి….
గాలనికి చిక్కిన చేప వలె….
గిజగిజలాడుతూ …..
కాలం మీద నమ్మకంతో
కాల ప్రవాహంలో ….
దుకడానికా నీ అంతులేని ఆరాటం
జాగ్రత్త సుమీ…..!
కాలనాగు లాంటి కాలం …..
పెను ఉప్పెనై కబళించగలదు…
– కవనవల్లి