ఉపవాస దీక్ష ఎందుకు చేస్తారంటే
రంజాన్ మాసంలో నెల రోజుల
పాటు సూర్యోదయం ముందు నుండి సూర్యాస్తమయం అయ్యేవరకు ఉపవాసం
ఉండే ముస్లిం సమాజం
ఈద్ రోజు అందరూ కలసి
పండగ చేసుకుంటారు. ప్రతి రోజూ ఐదు సార్లు నమాజ్
చేస్తూనే ఉంటారు.ఈద్
పండుగ రోజు తమ శక్తికొలది
పేదవారికి దానం చేస్తారు. అలా
దానాలతో పాటు ఖీర్, సేమియా మొదలైనవి చక్కగా
చేసి మితృలతో పంచుకుంటారు. అసలు
వారు చేసే నెలరోజుల ఉపవాస దీక్ష ద్వారా వారి ఆత్మ ప్రక్షాళన అవుతుంది తద్వారా సర్వ పాపాలు సమసిపోతాయి అని వారి విశ్వాసం.కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు అదుపులోకి వస్తాయి అని వారు భావిస్తారు.
-వెంకట భానుప్రసాద్ చలసాని
మితృలకు పండుగ శుభాకాంక్షలు.