ఊహాల ఉయ్యాల
మనసే ఊహల ఉయ్యాల.
ఊహలే మనిషిని మార్చేను.
మంచి ఊహలు మంచిగాను.
చెడు ఊహలేమో చెడ్డగాను.
ఊహలు రాని మనిషే లేడోయ్.
ఊహల ఉయ్యాలలో ఊగాలి.
ఆనందంగా జీవితం గడపాలి.
మదిని నందనవనం చేయాలి.
మనసును మంచిగా ఉంచాలి.
చెడు ఊహలు అందులోనాకి రానివ్వద్దు.
-వెంకట భానుప్రసాద్ చలసాని