ఊహల సరిహద్దు
ఆశల వలయంలో
విహరిస్తున్న ప్రపంచంలో
వింత వింత లోకంలో
కనువిందు జగత్తు లో
నడఆడుతున్న వినూత్న లోకం లో
ప్రేమ ఒక క్షపని వంటిది
ఆశ ఒక ఆకాశం వంటిది
శోకం ఒక సముద్రం వంటిది
మంచిది మేల్కొలిపితే కవిత
చెడును తెంచితే భవిత
చుక్కల్లో సూర్యుడు
కానున్న చంద్రుడు
విజ్ఞాన విపంచి అమరుడు
ఒక్క ప్రకృతి దేవత అమ్మ
ఒక చెట్టును నరికితే రెండు చెట్లను పాతు
వృక్షో రక్షిత రక్షితః
మంచి కి మెరుపు
చెడుకి కసవు
మధురం వంటి మంచిని ప్రకృతి అమ్మతో పోల్చు
ఊహల సరిహద్దును
బెరీజు వేసి నిలుచు
అదే మన ఊహల సరిహద్దుకు విజయము
– యడ్ల శ్రీనివాసరావు