ఉగాది పురస్కారాలు
ఆ మావి చిగురు తొడిగింది..
వసంత కాలం వచ్చింది..
మావి పూత పూసింది..
కాయలు కూడా కాసింది..
అందమైన ప్రకృతి పచ్చటి..
చీరను కట్టుకుంది..
రామ చిలుకలు మామిడి చెట్ల పై..
గుంపులు గుంపులుగా ఉన్నాయి..
వేప కూడా నాకేం తక్కువని..
తెల్లని పూత పూసింది..
ఆ ప్రకృతి మాత పచ్చదనంతో..
తెల్లదనం కలుపుకుని..
ఇంకా అందంగా ముస్తాబయింది..
నెమలేమెా ఉండీ ఉండీ ప్రకృతిని..
చూసి పరవశించి నాట్యమాడుతుంది..
అది చూసిన కోయిల తన రాగాన్ని..
ఇంకా మృదువుగా పాడుతుంది..
అదిగో! అప్పుడే వచ్చింది ఉగాది..
కవులలో నూతనోత్సాహం తెస్తూ..
కవి మది అదుపు తప్పి రాతలు రాస్తూ..
గానం చేస్తూ ప్రశంసలు అందుకుంటూ..
ఉగాది పురస్కారాలు పుచ్చుకుంటున్నాడు..
చూసిన ప్రతి వాళ్లూ మెచ్చుకుంటున్నారు!!
– ఉమాదేవి ఎర్రం