ఉగాది పండగ
శ్రీవాణి కొత్త పండుగ ఉగాది వస్తుంది పుట్టింటికి వెళ్లొచ్చని మనసు ఉవ్విళ్లూరతుంది నాన్న చేసిన ఫోన్ తో…!
అమ్మా! వాణీ వస్తున్నా పండుగకు తీసుకెళతానని ఉదయమే ఫోన్ చేసాడు..
కాసేపు ఆ ఆనందం అనుభవించాక అత్త లలితకు చెప్పిందామాట..
అత్తయ్యా…! నాన్న వస్తున్నాడు పండుగకు నన్ను తీసుకెళ్ళడానికి అంది శ్రీవాణి..
ఏంటి? ఎక్కడకు వెళ్లేది? ఇది చేదు పండగ మీ నాన్నకు రావద్దని చెప్పు అంది లలిత..
అయ్యో…! అలా అంటారేంటత్తయ్యా…? పెళ్లయ్యాక మెుదటి పండుగ కదా..! అయినా చేదుతో పాటు తీపి, వగరు, పులుపు ఇలా ఆరు రుచులు ఉంటాయి కదా! అంది అమాయకంగా…
ఎన్ని ఉన్నా దాంట్లో చేదు మాత్రమే మా నాన్నకు ఈ సంవత్సరం… ఈ పండుగకు పంపమంతే! అంది కటువుగా…
ఆశ నిరాశ కాగా భర్త దినేష్ వచ్చాక చెప్పింది శ్రీవాణి
ఇలా మా నాన్న ఫోన్ చేసాడు పండగకు తీసుకెళ్తానని వస్తానన్నాడు అని..
మీ అమ్మగారు ఇలా అన్నారని కూడా చెప్పింది..
ఏం పరవా లేదులే! నేనే నిన్ను తీసుకెళ్తా అని చెప్పి ఓదార్చాడు..
ఏం తీసుకెళ్తాడు? అమ్మ మాటే వింటాడులే! అనుకుంది
కానీ ఓపిక పట్టింది..
అన్న మాట మీద.. అలాగే తీసుకెళ్లాడు కూడా! తల్లికేం చెప్పాడో తెలియదుగానీ!
ప్రతి ఆడపిల్లకు అర్థం చేసుకునే భర్త దొరికితే జీవిత మంతా పండగే!
అన్ని రుచులతో కూడిన ఉగాది పండగలాగానె!
జీవితం అనుభవించాలి..
– ఉమాదేవి ఎర్రం