ఉద్యమం

ఉద్యమం

ఉద్యమం మెరుపు వంటిది
ఎక్కడో ఆకాశాన మొదలై భూమండలమంతా
ఉలిక్కిపడేలా గర్జిస్తుంది.
అది ఎవరికి వెలుగునిస్తుందో
ఎవరికి నిశను మిగుల్చుతుందో
పిడుగుపాటు కన్నా అత్యంత
ప్రమాదకరమైంది ఉద్యమం.
అయినా గొప్ప సంకల్పం కలది,
భహుషా మనుషుల్ని మెల్కొల్పేది
ఉద్యమమే నేమో….
ఉద్యమభావాలు రగల్చని హృదయం
అంటూ ఉండదేమో…!
సమస్త భూమండలంలో రగిలిన
ఉద్యమాలెన్నో, ఉద్యమకారులెందరో?
ఉద్యమాల దాహం ఎప్పటికీ తిరదేమో!
అపుడపుడు ఉపవాసం ఉంటుంది అంతే
బలహీనుల భలమే ఉద్యమం
ఎంతటి సామ్రాజ్యాన్నైనా కూల్చగల బలగం ఉద్యమం.
ఉద్యమకారులకు నినాదాలే ఆయువు
నినాదాలున్నంత వరకు ఉద్యమకారులుంటారు
ఉద్యమం గెలుస్తుందని చెప్పలేం గానీ
తన ఉనికిని కచ్చితంగా తెలుపుతుంది.
రాజ్యాలకోసం జరిగేవి యుద్ధాలు
కానీ రాజ్యంలోని బలమైన శక్తిపై
జరిపే పోరాటమే ఉద్యమం

– హనుమంత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *